STORYMIRROR

SATYA PAVAN GANDHAM

Abstract Action Others

4  

SATYA PAVAN GANDHAM

Abstract Action Others

"అంతర్మధనం..! (నేనొక కోపిష్టిన

"అంతర్మధనం..! (నేనొక కోపిష్టిన

1 min
414

"నేనొక కోపిష్టిని...!

నమ్ముకున్న వాళ్ళే నట్టేట ముంచుతుంటే,

ఎదురుతిరిగి ప్రశ్నించినందుకు నేనొక కోపిష్టినే...!

నేనొక కోపిష్టిని...!

అయిన వాళ్ళే అడ్డ దారులు తొక్కుతుంటే,

అడ్డుపడి మందలించినందుకు నేనొక కోపిష్టినే...!

నేనొక కోపిష్టిని...!

నెత్తినెక్కించుక్కున్న వారే వెన్నుపోటులు పొడుస్తుంటే,

ఏడపు చేతకాక అరిచినందుకు నేనొక కోపిష్టినే...!

నేనొక కోపిష్టిని...!

నాచే సాయం పొందినవారే నా ఆపద సమయాల్లో మొహం చాటేస్తుంటే,

నిస్సాహాయతగా ఓ చిన్న చిరునవ్వుతో వెనుదిరిగినందుకు నేనొక కోపిష్టినే...!

నేనొక కోపిష్టిని...!

ఆనాడు కష్టాల్లో నా తోడ్పాటు పొందిన వాళ్ళే,

ఈనాడు కృతజ్ఞత మరిచి కపట నాటకాలడుతుంటే,

అది తెలిసి కూడా మౌనంగా మెలిగినందుకు నేనొక కోపిష్టినే...!

నేనొక కోపిష్టిని...!

ముక్కుసూటిగా మాట్లాడుతుంటే,

అది నచ్చని విమర్శకులకు, బంధువులకు, స్నేహితులకు, సన్నిహితులకు, ఆకరికి అయినవాళ్ళకి నేనొక కోపిష్టినే...!

కోపిష్టి...! కోపిష్టి...!! కోపిష్టి...!!!

అని నా చుట్టూ ఉన్న సమాజం తమ స్వార్థానికై,

ఈ సరదా మనిషిపై చెరగని ముద్ర వేస్తూ,

చేయని తప్పుకు కూడా పదే పదే వేలేత్తి చూపుతుంటే,

తల్లడిల్లిన ఈ సున్నిత హ్రుదయం కలిగిన నేనొక కోపిష్టినే...!"

"మనల్ని నమ్ముకున్న వారిని మోసగిస్తే, 

మనల్ని మాత్రమే కాదు ఒక్కోసారి వారి నమ్మకానికున్న ఆ నమ్మకాన్ని కూడా కోల్పోతారు ఆ అవతలి వాళ్ళు.

ఒక సాధారణ మనిషిని కూడా కోపిష్టిగా తీర్చిదిద్దే నమ్మలేని నిజం ఆ పోగొట్టుకున్న నమ్మకమే!

నాలోని కోపం నాకొక లోపమో లేక శాపమో,

నమ్ముకున్న వాళ్ళే మోసగించి ముంచిన వేళ,

ఆ నమ్మకం పోగొట్టుకున్న అవతలి వాళ్ళలో నేనొకడిని!

అందుకే నేనొక కోపిష్టినే...!"

- Satya Pavan Writings ✍️✍️✍️



Rate this content
Log in

Similar telugu poem from Abstract