STORYMIRROR

Kadambari Srinivasarao

Abstract

4  

Kadambari Srinivasarao

Abstract

అనంత పయనం

అనంత పయనం

1 min
238


ఆరాటం పాదానికి తొడిగి ఏదో సాధించాలని..

తెలియని వెలితితో బయటకు అడుగు ..

అందినదానితో తృప్తి చెందని స్వభావం

తలచినది సాధించాలనే తపన

కష్టాల చీకటిని చీల్చుకుంటూ

వెలుగు సామ్రాజ్యంలో

సామ్రాట్టులా నిలవడానికి నిత్య పోరాటం

జీవితంలో గెలుపు కూడిక

ఓటమి తీసివేతలను బేరీజు వేసుకుంటూ

నిత్యం ఉత్సాహ ఊపిరి నింపుకుని

దోసిట గుప్పెడు ఆశలను పట్టి

మనసు కౌగిట మూటగట్టి..

ఊపిరి అనంత వాయువులలో కలిసే వరకు 

అంతమవని పయనం

శరీరం చేరలేని ప్రతిచోట

ఆత్మ పయనపు జాడలు కనులముందు 

స్వప్నమై కదలాడుతూనే ఉంటాయి

తరాలు మారినా, దారులే తప్పినా

పయనం మాత్రం కొత్తదనాన్ని అన్వేషిస్తూ..

అలుపు కలిగినా ఆరాటం మాత్రం తీరని దాహం

గమ్యం వెతుకులాటలో సాగే ఈఅనంత పయనం



Rate this content
Log in

Similar telugu poem from Abstract