అన్నీ నీవే -, అన్నింటా నీవే
అన్నీ నీవే -, అన్నింటా నీవే


మాతృమూర్తి గర్భాన మహాలక్ష్మివై జన్మించావు
తోబుట్టువులకు ఆత్మీయత పంచగా ఆడబిడ్డవైనావు
సమాజంలో సహనంతో మెలగుటలో సాటిలేని మేటి అనిపించావు
సకల విద్యలు సాకారంతో అగ్రపధమున నిలిచావు
పురుష జీవితానికి సార్ధక్యమందించగా ఆలి స్థానమలంకరించావు
సంతాన లక్ష్మిగా వెలుగొందగా ఆర్తితో వేదనలెన్నో అనుభవించావు
అందుగలవిందులేవని సందేహము వలదంటూ అన్ని రంగములా అగ్రగామిగా నిలిచావు
సత్వ, రజో, తమో గుణాల మేలి కలయికతో స్త్రీ స్థానము స్థిరపరిచావు
సమతా, మమతలు పంచగా సాటిలేరు నీకెవరంటూ సమదృష్టితో మెలిగావు
నిరూపమాన సేవలందించుటలో నిరతము నిన్నే మరిచావు
ఏమివ్వగ నీ ఋణం దీరు!...
ఓ వనితా అందుకో మనఃపూర్వక నమస్సులు...