STORYMIRROR

ARJUNAIAH NARRA

Inspirational

4  

ARJUNAIAH NARRA

Inspirational

అంబెడ్కర్ పత్రికలు

అంబెడ్కర్ పత్రికలు

1 min
253

మూగబోయిన గొంతులకు

'ముక్ నాయక్ ' పత్రిక 

నిమ్నజాతిలో నిద్రణమై ఉన్న 

చైతన్యనానికి ప్రతీక


ప్రగతిశీల మార్పుకు

స్వయం సేన, పోరాటాలతో

ఆత్మవిశ్వాసం చైతన్యం చెందించినదే

బహిష్కృథ్ భారత్ పత్రిక


అపార మేధస్సు

అద్భుత పాండిత్యం

సూక్ష్మ గ్రాహ్యతకు

ఆశయాలకు

అనుసరించిన విధానాలు

కర్తవ్య నిర్వహణలో స్పష్టత

అన్నింటికీ అడ్రసు అంబెడ్కర్


సమత, జనతా ,పీపుల్స్ హెరాల్డ్

ప్రబుద్ద భారత్  పత్రిక ఏదైనా ప్రాముఖ్యతా

ఒక్కటేనని నవసమాజ నిర్మాణంలో

విరమ మెరుగాక విద్యావ్యాప్తికి

సమత సైనికదల్ తో అడుగడుగునా

దరిద్రులు నిర్భాగ్యుల జాతులకు

నిరంతర ప్రళయకాల ప్రభంజనంతో

విరుచుకుపడి కదం తొక్కి గళం విప్పి

నాలుగు తలల నాగుపాము విష కోరలు పెకిలించి

దళిత పౌర హక్కులను సాధించి 

భారత బహుజనల బంధువు అయ్యాడు....


సభలు, సమావేశాలు, ఉద్యమాలు

పార్టీల ఏర్పాట్లు, పత్రిక ప్రచురణలు

కమిటీలకు నివేదికలు, ప్రతిపాదనలు 

సత్యాగ్రహాలు,సమతకు సంస్కరణలు

లేఖలు,వ్యాసంగాలు, గ్రంథ రచన


గాంధీజీ మనుషులు మేల్కొని ఉంటారు

కనుక గాంధీజీ నిద్రపోతుంటారు

జిన్నా మనుషులు చైతన్యంతో ఉన్నారు

కనుక జిన్నా నిద్రపోతుంటారు

నా మనుషులు చైతన్యవంతులు కాదు 

వాళ్ళు నిద్రపోతున్నారు 

కనుక వాళ్ళని మేల్కొలపాలి అంటే నేను

రాత్రులంతా మేల్కొని పుస్తకాలు రాస్తున్నానంటివి


ఒక రోజులో రెండు సార్లు సూర్యోదయం కాదు

అని కాలం విలువ తెలిసినోడు

తెల్లారి లేస్తానన్న నమ్మకం లేకున్నా

బుద్ధుడి బోధనలు గురించి కూర్చి

మనలను మేల్కొకొలిపి తను కాలధర్మం చేసాడు



Rate this content
Log in

Similar telugu poem from Inspirational