Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Kalyani B S N K

Tragedy

5.0  

Kalyani B S N K

Tragedy

అమృతవాహిని

అమృతవాహిని

1 min
360


పచ్చదనం జీవం అయితే

నీలపు నింగే ఊపిరి అయితే

నీటి పరవళ్లు

ఈ అవని గుండె చప్పుళ్ళు..


జలచరాలు, భూచరాలు..

ఎగిరే పిట్టలు,

గెంతే కప్పలు..

చతుష్పాదులు..

చల్లని సెలయేళ్ళు..

ఈ ప్రకృతీ..

ఈ చైతన్యం..

లోకం సమస్తం ..నిత్య వసంతం.


ఆశలు అత్యాశ గా మారినప్పుడు..

ఎల్లలు ఎరుగని సుఖాల వేటలో..

హద్దే లేని స్వార్థ జగం లో..

కాలుష్యం కోరలు చాస్తే..

భూగోళం పగుళ్లు వారితే..

ప్రళయ విలయమే సుళ్లు తిరిగితే..


ఓ అమృత వాహినీ..

ఏదీ నీ ఉనికి?

ఏదీ నీ చైతన్యం!?

ఏదీ నీ అస్తిత్వం..!?


Rate this content
Log in

Similar telugu poem from Tragedy