STORYMIRROR

Praveena Monangi

Inspirational

4  

Praveena Monangi

Inspirational

అమ్మ ప్రేమను ఎలా కొలవను?

అమ్మ ప్రేమను ఎలా కొలవను?

1 min
336

అమ్మ ప్రేమను కొలిచేందుకు

           ఆకాశమంత పాత్ర కావాలేమో!

అమ్మ మనసు కొలిచేందుకు

          వెన్న,మంచు పోటీకి సిద్ధం కావాలేమో!

అమ్మ ప్రసవ వేదన కొలిచేందుకు

  మన దేహాన ఎముకలు పోటీపడి విరగాలేమో!

అమ్మ సేవను కొలిచేందుకు

           మధర్ థెరీసా మళ్ళీ జన్మించాలెమో!

అమ్మ సహనాన్ని కొలిచేందుకు

           భూమాత సహాయం కోరవలెనేమో!

అమ్మ కన్నీటిని కొలిచేందుకు

            సప్త సముద్రాలు ఏకమవ్వాలేమో!

అమ్మ మౌనాన్ని కొలిచేందుకు

     ఋషుల తపస్సుకు భంగo వాటిల్లాలేమో!

చివరకు తాను సృష్టించిన అమ్మలోని

             ప్రేమామృత సుధలను ఆస్వాదించేందుకై

ఆ బ్రహ్మే మరళా అమ్మ కడుపున జన్మించాలెమో!


Rate this content
Log in

Similar telugu poem from Inspirational