STORYMIRROR

Midhun babu

Inspirational Others

3  

Midhun babu

Inspirational Others

పారని వీటిలో బురద సందడి

పారని వీటిలో బురద సందడి

1 min
167


ముగింపు లేని వాక్యాలతో నడుచుకుంటూ

కన్నీళ్ల నదిలో స్నానం చేస్తున్నాను

ఊపిరిలో ప్రాణవాయువు శాతం తగ్గుతుంటే

పచ్చని అడవిలో విషవాయువు నింపుతున్నాను..!!


హృదయ కొలనులో గులకరాళ్ళ చప్పుడు

పారని నీటిలో బురద సందడి

దిగబడిన పాదము జ్ఞాపకాల గుర్తుల్లా

కాలపు ‌ ప్రవాహములో శిలాఫలకములా నిలిచే..!!


ఆశలు అమృతంలా మనిషిని బ్రతికిస్తున్నాయి

చూడని పదార్థమైన ముందుకు అడుగులేస్తుంది

ఆకాశ పుష్పమైన నేలపై చిగురిస్తుంది

ప్రకృతి దుప్పటిలో మాయాజాలం చేస్తుంది...!!


నిలుచున్న హిమశిఖరం మాట్లాడదు

యుగాలకు సాక్షిగా నిలిచినా నిజం చెప్పదు

లేని పాల సముద్రానికి వంతు పలుకుతూ

నింగిలోని హంసలను నేల వైపు చూపిస్తుంది..!!


చేతి వేలి గీతాలు చిత్రాలు గీస్తుంటే

సప్త వర్ణముల వర్షం అంతా కురిసి సింగారించే

ఖాళీ హృదయములో ఊహల రంగు మెరిస్తే

అల్లుకునే అక్షరాల్లో ఇంద్రధనస్సు విల్లులా విరిసే..!!


ఊహల్లో పిచ్చి రాతలు రాసుకుంటూ పోతే

కాగితంపై వాలి కావ్యమై అలరిస్తూ పోయే

హృదయ వీణలు వాయిస్తూ స్మరిస్తే

అక్షర మయూరి లా పురివిప్పి నాట్యం చేసే..!!


దిక్కుల అంచుల్లో కిరణాలు తాకుతుంటే

ప్రపంచం అరుణ వర్ణమై నేలపై నిద్రపోయే

కాలప్రదాతలు భూమిని నడుపుతుంటే

కవిత్వమంతా నలుదిక్కుల దివిటీలా నిలబడే..!!


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Inspirational