వెలుగు రేఖలు
వెలుగు రేఖలు
ఏం చెయ్యగలవు ఆంతర్యం లేని
సిద్ధాతాలు, దాచలేవు ఎన్నడూ నమ్మలేని
నిజాలు, అందంగా కనిపించెను కృత్రిమ కుసుమాలు,
కాని ఎన్నడూ వెదజల్లలేవు సువాసనలు ఇంపుగా కనిపించెను
కుందనపు బొమ్మలు, కాని చూపలేవు
పసిపిల్లల కేరింతలు చిరునవ్వులు, రేచుక్కల వలె
మెరవగలవు నభంలో నక్షత్రాలు, కాని విస్తరించలేవు
జ్ఞానదీపం దీపాంజలి జయదీపం వలె వెలుగురేఖలు ....

