STORYMIRROR

Midhun babu

Romance Inspirational Others

3  

Midhun babu

Romance Inspirational Others

పక్షిలా స్వేచ్ఛ కావాలి

పక్షిలా స్వేచ్ఛ కావాలి

1 min
184


పక్షి లోని స్వేచ్ఛ చూసా

మనిషిగా నేను సగం సచ్చా

పురి విప్పేందుకు ఆశలెన్నో

స్వతంత్రంగా ఎగిరేందుకు ఆంక్షలు ఎన్నో...


ఆకాశాన్ని ఆక్రమించి మిరుమిట్లు గొలిపితే

నా కళ్ళల్లో కన్నీళ్లు నేలపై తడిసే

రాలిన చుక్కల్లో రెక్కలు మొలువలేదు

పక్షి పరవశంతో నన్ను చూచి పాటలు పాడెను...


నింగిలో అందంగా గొంతెత్తి గోల చేస్తుంది

నా భావాలకందక తిరుగుతుంది

అహంకారపు తో స్వేచ్ఛను కోల్పోయి అలమటిస్తే

అడుగడుగున విద్వేషాలను రాగాలు వినిపించే...


అందమైన గూడులో ఆనందంగా గడుపుతూ

చిరుగాలుల సేవలో నిత్యం తరిస్తూ

ఇంద్ర భవనాలను కాలితో తన్నుతూ

వైభవానికి స్వర్ణ నగరాన్ని తలపిస్తూ ఎగురుతుంది..


కొమ్మల మధ్య సుందర శిల్పంలా కనిపించే

గతి తప్పిన నా మనసుకు గతము బోధించే

ఆశల రెక్కలు సమతూకము లేవని

విహంగపు వినోదం అక్షరాలలో కల్పించే...


నిత్యము పంజర జీవితములో నా బ్రతుకు

వ్యామోహపు ఆశల వలలో చిక్కుకున్నాను

బాంధవ్య కట్టుబాటు కంచెలో విలవిలలాడుతూ

ఆకాశములో నిన్ను చూసి మురిసిపోతున్నాను..


గగణములో నీవు పోటీ పడుతుంటే

నేలపై పరుగులు తీస్తూ అలసిపోతున్న

ఎడారిలో నడిచి నడిచి ఎండిపోతూ

పచ్చదనపు పరవళ్ల కోసం ఎదురు చూస్తున్నాను...


Rate this content
Log in

Similar telugu poem from Romance