STORYMIRROR

Midhun babu

Romance Inspirational Others

3  

Midhun babu

Romance Inspirational Others

కిరణం

కిరణం

1 min
173

నా కవనాలు లోకానికి కిరణాలు 

బానిసవర్గానికి ఆశాజ్యోతులు 

కార్మిక లోకపు ఆర్తనాదాలు 

యువశక్తికి ప్రగతిమార్గాలు 


నా కవనాలు దగాపడ్డ జనాల ఆత్మఘోషలు 

చేయూతనిచ్చి ముందుకి నడిపే 

పెళ పెళ మని గర్జించే మేఘపు ఉరుములు 


నా కవనాలు సామాన్యుడి చెమట చుక్కపు సువాసనలు 

అదే సామాన్యుడి ఆకలికేకలు 

కసితో రగిలే వాడి బతుకుపోరాటాలు  

వాడికి స్ఫూర్తిని ఇచ్చే బ్రతుకు పాఠాలు


నా కవనాలు ఆ సముద్రుడి ఆగ్రహావేశాలు  

కెరటాల సమూహాలు 

తుఫానుల కలయికలు 

ఆ సాగర సంభాషణలు 

సాగర గర్భ రహస్యాలు 


నా కవనాలు అరిషడ్వర్గాల ప్రస్తావనలు 

వాటి నుంచి బయటపడడానికి మార్గాలు 


నా కవనాలు నిను మెల్కొలిపే విఙ్ఞాన వీచికలు 

నీ జీవితానికి లక్ష్యాన్ని చూపే మార్గదర్శకాలు 


నా కవనాలు మలయ మారుతాలు 

ప్రణయ గీతాలు 

ప్రేమ పాఠాలు 


నా కవనాలు ప్రకృతి ఒడిలో నిదురోయే జోలపాటలు 

హృదయాంతరాలలోని 

అగాథాల కావ్య రూపాలు 


నా కవనాలు ఆ అనంతుని  

పాద సేవలో తరించే పుష్పాలు 

ఆ అనంతుని కృపా కటాక్షాల


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Romance