అమ్మ ప్రేమ మదురమైనది.
అమ్మ ప్రేమ మదురమైనది.


మనల్ని నవమాసాలు మోసేది అమ్మ,
మన చేతులు పట్టుకొని బుడిబుడి అడుగులు నడిపించేది అమ్మ,
మమకారపు ముద్దులు కలిపి తినిపించేది అమ్మ,,
మురిపాల లాలలు పాడి పడుకో పెట్టేది అమ్మే,
మనసారా మనల్ని ముద్దాడే ది అమ్మే,
మనకు కమ్మటి కథలు చెప్పేది ఆమ్మే,
మన సుఖదుఃఖాలు పంచుకునేది అమ్మే,
మనకు మధురమైన బంధాన్ని నేర్పించేది అమ్మే,
మన జీవితాన్ని చూపించేది అమ్మే,
తన ప్రాణాలను లెక్కచేయకుండా మన కోసం త్యాగం చేసేది అమ్మే,
మనతో ముందుగా స్నేహం చేసేది అమ్మే,
గుండెల్లో ప్రేమని దాచుకునేది అమ్మే,
దేవుడు పంపించిన నిలువెత్తు రూపం మా అ
మ్మే.
మన నుంచి ఏమీ ఆశించరు,
మనం కనబడకపోతే అల్లాడి పోతారు,
మనకు ఆకలేస్తే పస్తులుండి మరీ అన్నం పెడతారు,
వాళ్లు రేయింబవళ్లు కష్టపడి మనల్ని సంతోష పెడతారు,
మనకు ఎల్లప్పుడు కాపలా ఉంటారు,
మనకు ఏదడిగినా కొని పెడతారు,
మనకు బాధ వస్తే ఓదారుస్తారు,
మనల్ని ఇష్ట దైవంగా భావిస్తారు,
మనం తప్పు చేస్తే వారు సరిదిద్దుతారు,
మనల్ని కంటికి రెప్పలా కాపాడుతాడు,
వారే మన అమ్మానాన్నలు.
అమృతం దొరికితే పంచుకునే వాళ్ళు దేవతలు,
అదేే అమృతం దొరికితేే పిల్లలకు పెట్టే వాళ్లు అమ్మానాన్నలు.