అలా తాను
అలా తాను
అలా తాను నను చూస్తూ..నవ్వుతూనె ఉండాలి..!
తన నవ్వుల మధువులు నే..త్రాగుతూనె ఉండాలి..!
మంచుపూల సంగీతం..వినిపించే వేళలో..
తన అల్లరి చూపులు నే..చదువుతూనె ఉండాలి..!
పలకరించు లేతగాలి..పరవశించు తీరాన..
తన సొగసుల మెఱుపులు నే..మీటుతూనె ఉండాలి..!
కనురెప్పల అలజడులకు..ఓషధియే తన తలపు..
తన ఆశల ఊసులు నే..పాడుతూనె ఉండాలి..!
బొమ్మలాగ తాను నిలచి..చూస్తుందే నావైపె..
తన తియ్యని సిగ్గులు నే..ఏలుతూనె ఉండాలి..!

