STORYMIRROR

Midhun babu

Classics Fantasy Others

4  

Midhun babu

Classics Fantasy Others

అక్షరాల అద్దాలు

అక్షరాల అద్దాలు

1 min
0


.అక్షరాల అద్దాల ఏ ఆత్మలు ప్రత్యక్షమయాయో.....
నిక్షిప్తమై ఏ భావ శకలాలు రోదిస్తున్నాయో...
యూగాల నాటి 
ప్రేమ ధార ....తప్తధారై రక్తధారై...
నా మనసు కంట
కురుస్తూనే... ఉంది
చెట్టు పండవక ....
చేను. పంటవక ...
మింటి చుక్కలు నేల
చూడక...
నది లాస్యం ఎపుడాగి పోయిందో....
సికరి కణ గణములు
సిగ్గునెలా తలవాల్చాయో....
మణి మాణిక్యాలను ముడిచిన మహి ఎండిన ఎడారి గొంతుకై.....
పువ్వులేని...
నవ్వులేని..
అంతటా.....
మోగని మువ్వలే
నిర్దయ వర్జన్య ప్రాఖర్య దుర్మార్గ ఉద్రేకాలే
ఏ ప్రాభవాన్ని పుడమి
ఆశిస్తోందో...
ఏ విషాదాన వియత్తలి
శోకిస్తోందో.....
ఏ జల ఘాతాల గర్జిత 
తరగల కడలి  
ఘూర్ణమౌతోందో...
ఏ చక్రగ్రాహాలనో చిక్కి. చక్కబడని స్నేహాల చలించు జనత....నవ యువత 
ఏ పరిమితినాశిస్తోందొ...
.హృదయాహ్లాద గీతం..
సంగీతం...హితగీతం
మతం...సమ్మతం...
సమ్ముదం ...మరచి...
విడిచి...
ఏ సముత్పత్తి కోసం
ఏ వైపు ప్రయుక్తి. లేని
.ప్రయత్న రహిత పయనం...
సమత నవత కనరాని
ఏ దిక్కుల మొక్కుల
మొగసాల వైపుకి......


Rate this content
Log in

Similar telugu poem from Classics