అక్షర మైత్రి
అక్షర మైత్రి
అలవికాని ఆలోచనలు ఉప్పెనై ముంచెత్తుతున్నాయి
మౌనాలను వీడలేని నిస్సహాయినయ్యాను
నిర్లిప్తతలు నిత్యమై వెంట పడుతుంటే
మాటల పూదోటలో ఎలా విహరించ గలను.?
మదినిండా తిమిరాలే తరుముతున్నాయి
కురిసే వెన్నెలను ఎలా వీక్షించగలను .?
ప్రపంచాన్ని చుడాలని తలుపులు తెరుచుకున్నా
మూగదైన లోకంలో పలుకులు ప్రవహించలేక పోతున్నా
బంధాలు అవసరాలుగా మారి స్వార్ధంతో సహగమనం చేస్తున్నాయి
పలుకరింపుల ప్రశ్నార్ధకాలకు జవాబు దొరకడంలేదు
బ్రతుకుపాఠాలు బతకడం నేర్పిస్తున్నాయి
అక్షరమైత్రి ఆత్మీయమై అక్కున చేర్చుకుంటోంది ..!
