అజేయుడా..
అజేయుడా..
అబద్ధాలు చెప్పడంలో ఆరితేరి
అనుకోని ప్రమాదాల్లో
పక్కనున్న వారిని ఇరికించి
తను తప్పుకునే ధీశాలి
కంటి సైగలతో భాషను మార్చి
హావభావాలతో
కొత్త అర్థాలు చెప్పే పాత కళాకారుడు
వ్రాసింది ఒకందుకు
చెప్పింది మరొకందుకు
అసూయతో అనే మాటలు
వీనులవిందుగా వినిపిస్తాయా
మరో పెను తుఫానులా
నీ ఆలోచనల్ని నిర్వీర్యం చేసే
ఓ సంకేతంలా
నీకు దగ్గరగా రావొచ్చు
నిన్ను నీకు దూరం చేసి
తను చెప్పిందే నిజమని
నిన్ను భ్రమింపజేసే నైపుణ్యం
మరెన్నో హంగుల రంగుల మోసాల రూపం
దూరముంటే పర్లేదు
కానీ
సమాజం సర్దుకోవాలంటుంది
ఆకస్మిక మార్పులకు సిద్ధపడే గుణం
నీకున్నా లేకున్నా
ఓ వయసు దాటాక
నీ సంతోషం కోరుకోని అజేయుడిని
వెతికి మరీ పక్కనే పెడుతుంది
నువ్వే జాగ్రత్తపడాలి
సమయానికి అసలు
మాట్లాడకుండా
పని చేస్తూ సాగిపోవాలి
