ఐశ్వర్యం
ఐశ్వర్యం
ఐశ్వర్యం అంటే ఇంద్రభవనం కాదు
పూరిగుడిసె అయినా
పలకరించడానికి ఓ మనిషి
నాకంటూ ఓ మనసు
ఏడువారాల నగలు కాదు కోరుకున్నది
ఏడుపొచ్చిన ప్రతీసారి నవ్వించగలిగే మనిషి
నేనున్నా నీకోసం అని సాక్ష్యంగా నిలుస్తున్న తోడు
ప్రేమపల్లకీలో కలకాలం ఊరేగించేయడం
వజ్రాలతో నిండిపోవడం కాదు జీవితం అంటే
తన దగ్గర అన్ని ఉన్నప్పుడు ఇవ్వడమో
లేక నేను దూరమయ్యాక ఏడవడమో కాదు
పక్కన ఉన్నప్పుడు ప్రపంచాన్ని మైమరించే బంధం
మనకు దొరకడం జీవితం అంటే
బంగారంతో మెరిసిపోవడం కాదు గౌరవం అంటే
కష్టాల్లో ఉన్నా కలిసి ఉండడం
అధికారం కాకుండా మనసుల మధ్య
ఆప్యాయత నిండి ఉండడం
గడిపేసమయం తోడైతే మనిషి నీడ కూడా
మనతో మాట్లాడేస్తుంటే
పూరిగుడిసెలోను మహారాణిలా బతికేయొచ్చని
వారిమధ్య ఉన్న చిరునవ్వు చెబుతుంది.
మనసు అర్దం చేసుకున్న తోడు దొరకడం అదృష్టం...
... సిరి ✍️❤️
