STORYMIRROR

Midhun babu

Romance Inspirational Others

4  

Midhun babu

Romance Inspirational Others

అడగాలని ఉంది

అడగాలని ఉంది

1 min
390

ఆపదల నుండి తప్పించేవాడే

ఆపదలలో నెట్టేస్తుంటే 

అడగాలని ఉంది 

అంత పాపం నేనేం చేసాను అని


ప్రేమించే మనసు

ద్వేషించడం మొదలుపెట్టాక 

అడగాలని ఉంది

అంతగా నేను నచ్చక పోవడానికి

కారణం ఏమని


తప్పే చేయకపోయినా 

ఆడదానివి కాస్త సర్దుకు పొమ్మని 

సలహాలు విసిరేస్తుంటే

అడగాలని ఉంది నా స్థానం లో 

ఒక్కసారి ఆలోచించమని


నేరమే చేయకుండా

శిక్ష అనుభవించాలని శిక్షిస్తుంటే

అడగాలని ఉంది నేటి సమాజాన్ని

అంత నేరం నేనేం చేసానా అని


అడగాలని ఉన్నా

మూగబోతున్నది గొంతు 

పారిపోతున్నాయి మాటలు

ఎవరిని అడగాలో అర్థం కాకపోయినా 


Rate this content
Log in

Similar telugu poem from Romance