అడ్డుగీత
అడ్డుగీత
ఎప్పుడు అనుకోనిది...
ఎన్నడూ ఆలోచించనిది...
నిన్ను పరిచయం చేసే సూత్రమది...
నన్ను తన్మయములో నింపినది...
ఎంతో నొప్పి అనుభవాన్ని చూపినది...
ఎన్నోసార్లు గుర్తుకొచ్చే తీపి జ్ఞాపకమది...
నీలో నా ప్రతిబింబాన్ని చూపే అద్దమది...
నాలో నీ స్పందనను అందించే సాధనమనది...
ఏ కన్ను చూడని ప్రతి రూపమది...
ఏ చెవికి అందని హృదయలయది...
నవమాసాలుదాగిన మోసిన గర్భాలయమది...
నా తనువులో నిన్ను తీసిన మార్గమది...
మచ్చ కాదది మాతృత్వపు మాధుర్యాన్ని
అందించిన అందమైన అడ్డుగీత ఇది...!
