ఆవిడ కొరకు
ఆవిడ కొరకు


జీవితం లో వచ్చెను ఎందరో స్త్రీమూర్తులు,
అందరు ఎదో విధంగా చిరస్మరణీయులు |౧|
తల్లి లేనిదే ఎవరికీ జీవితం లేదు,
మాతృమూర్తి లేనిదే మాతృభాషా లేదు |౨|
సంతానం కోసం అమ్మ భరించెను ఎన్నో కష్టాలు,
సంతతి సంతోషానికి ఎదురుకొనెను అన్నిరకాల నష్టాలు |3|
బిడ్డ ఎప్పడు ఉంచుకోవాలి తల్లి త్యాగానికి జ్ఞాపకం,
ఆమె సరదా కొరకు ప్రయత్నించాలి సంపాదించటానికి పతకం |౪|
అర్ధాంగి జీవితం ఒక అందమైన పుస్తకం,
రెండు కుటుంబాల మధ్య ఆమె పాత్రధారణ కీలకం |౫|
భర్తకు ఎప్పుడు గుర్తు ఉండాలి భార్య విడుపు,
తానే తేగలదు భర్త వంశంలో ఏ రకమైన ఏదియైనా మలుపు |౬|
పెనిమిటి ఇవ్వాలి ధర్మపత్నికి ఎల్లవేళలా రక్షణ ,
ఆవిడ కొరకు సిద్ధంగా ఉండాలి చెయ్యటానికి ఘర్షణ సంరక్షణ |౭|