ఆశయం విడువకు
ఆశయం విడువకు


నీ లక్ష్యసాధన లో
ఆశ వదలకు
ఆశయం విడువకు
అలసట చెందకు
అనుమానాలు తీర్చుకో
అవమానాలు ఓర్చుకో
ఆఖరి వరకు పట్టుదల వదలకు
కష్టాలే నీ నేస్తాలవని
కన్నీళ్ళే నీ కానుకలవని
కాలమే కనికరించకపోయిన
క్షణం కూడా విశ్రమించకు
కడలిలో నింగిని తాకాలని ఎగిసిపడే కెరటం లా
కడ వరకు నీ ప్రయత్నం మానుకోకు
ఓర్పు,సహనం ఆయుధాలుగా చేసుకొని గెలుపు తలుపు తీసే వరకు పోరాడు
ఓటమిని ఎప్పుడూ ఒప్పుకోకు
ప్రయత్నం లో ఎవరూ పట్టించుకోరు
ప్రయత్నించి గెలిస్తే అందరూ అభినందించే వారే
గొంగలిపురుగు కూడా ఎవరికి నచ్చదు
అది సీతాకోక చిలుకగా మారగానే అందరూ దాన్ని పట్టుకోడానికి పరిగెడతారు
నీ విజయం కూడా అంతే