STORYMIRROR

Praveena Monangi

Inspirational

3  

Praveena Monangi

Inspirational

ఆశ

ఆశ

1 min
222

నేను పుట్టగానే మా అమ్మ పొత్తిళ్లలో హాయిగా నిదురించినఅలనాటి ఆ అనుభూతిని పొందాలని ఆశ

మా అమ్మ ప్రేమగా తన ఒడిలోకి తీసుకునితొలిసారిగా నన్ను ముద్దాడిన ఆ చుంభన స్పర్శ పొందాలని ఆశ

తను తండ్రి అయిన గర్వాన లాలనగానన్ను తన చేతులలోకి తీసుకుని నా నుదుటన తొలి చుంభన చేసిన ఆ దృశ్యము చూడాలని ఆశ

నేను ఎందుకు ఏడుస్తున్నానో తెలియక కంగారు పడిన మా అమ్మానాన్నల తపన చూడాలని ఆశ

నన్ను ఎత్తుకుని చందమామని చూపిస్తూ గోరుముద్దలు తినిపించిన అమ్మచేతి కమ్మదనాన్ని ఆస్వాదించాలని ఆశ

తన భుజము మీద నన్ను నిద్రబుచ్చుతూతనూ నిద్రలోకి జారుతున్న మా నాన్న చేతి లాలన పొందాలని ఆశ

తప్పటడుగులు వేస్తూ వడివడిగా పడుతూ లేస్తూఉన్న ఆ నిమిషాన మా అమ్మ కళ్ళల్లో ఆనందాన్ని చూడాలని ఆశ

ముద్దుముద్దుగా నేను పలికే తొలి పలుకులను వింటున్న నాన్న ఆసక్తి ని చూడాలని ఆశ

జ్వరమొస్తే కంగారుగా డాక్టరు దగ్గరకు పరుగెత్తి నన్ను కోలుకునేటట్లు చేయమని డాక్టరుని ప్రాదేయపడుతున్న నాన్న వేదన చూడాలని ఆశ

అక్షరాభ్యాసము రోజున నాన్న ఒడిలో కూర్చుని తన చేతితో ఓంకారాన్ని చుడుతున్న ఆ శుభతరుణాన్ని వీక్షించాలని ఆశ

ఇటువంటి ఎన్నో తిరిగిరాని మరపురాని అనుభూతులను మళ్ళీ పొందాలని ఆశ.


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Inspirational