STORYMIRROR

Midhun babu

Romance Classics Fantasy

4  

Midhun babu

Romance Classics Fantasy

ఆనందపు చిరునామా

ఆనందపు చిరునామా

1 min
3


ఆనందపు చిరునామా..అందించెను తాను..!

అనురాగపు గీతమాల..నను చేసెను తాను..!


కడలికి పాటను నేర్పే..చిరునవ్వుల రాణి..

అక్షరాల వేణువులా..మది మలచెను తాను..!


విరహమెంత తియ్యనిదో..తెల్పు గమకమేది.. 

పలుకకనే నాలోలో..వెలిగించెను తాను..!


ప్రతాపము చల్లారగ..హిమనగరికి ఏల.. 

సుస్వరాల వెల్లువతో..అలరించెను తాను..! 


ఈ మాటలు చెలిమౌనపు..అనువాదం చూడు.. 

చెప్పలేని ఒక ఖైదున..నన్నుంచెను తాను..! 


Rate this content
Log in

Similar telugu poem from Romance