STORYMIRROR

Jayanth Kumar Kaweeshwar

Abstract Action Inspirational

4  

Jayanth Kumar Kaweeshwar

Abstract Action Inspirational

ఆనందో బ్రహ్మ

ఆనందో బ్రహ్మ

1 min
259

వచన కవితా సౌరభం (పద కవిత )

శీర్షిక : ఆనందో బ్రహ్మ :తేదీ : 05 . 06. 2022

కవీశ్వర్ :

తమ జీవితంలో స్వీయ జ్ఞాన సముపార్జనమే ఆనందో బ్రహ్మ

జ్ఞానేంద్రియాల క్రియ విశేషమే ఆనంద నిస్సందేహ ధర్మ

కర్మేంద్రియాల క్రీడా ప్రమేయమే రస మాధుర్య సాహిత్య ధర్మ

పెద్దల అనుభవసారమే మనకు తగిన మనఅందాల సో పాన కర్మ


స్త్రీ గళ సౌకుమార్య రమణీయ సుమధుర గీతం కర్ణపేయ సహవాసం

లలనా సౌందర్యాకృతి చందాన గంధం సునయన దృశ్యాగమనం

తరుణీ సమస్యాత్మక వివాదం న్యాయ సమీకరణ సమాజ ప్రభంజనం

నెలతా నినాదం స్వీయ రక్షణ ప్రభుతా సహకార , సహయోగ నిరీక్షణం


పడతుల సమూహ నర్తనం బతుకమ్మల ఆహ్లాద సందోహ కీర్తనం

కోలాటాల చక్కని తల్లికి చాంగుభళా అంటూ ఆనంద విహారం

పండుగల వేడుకలలో జానపద గీతాల శ్రోతల పెదాలపై నర్తనం

ఐకమత్యమే మహా బల్గమని నిరూపించే గమన శిఖర అధిరోహణం


వ్యాఖ్య : "స్త్రీ వాద - నినాదం ప్రభంజనం అభివృద్ధి బాటలో

భారత దేశ కీర్తి వృద్ధికి మహదానందో బ్రహ్మ "


Rate this content
Log in

Similar telugu poem from Abstract