STORYMIRROR

Dinakar Reddy

Abstract Romance

4  

Dinakar Reddy

Abstract Romance

ఆకు మీద సీతాకోకచిలుక

ఆకు మీద సీతాకోకచిలుక

1 min
356

నీరసంగా తెరుచుకున్న ఆఫీసు కిటికీ

ఉక్కపోత సముద్రపు నీటిని ఉడికిస్తున్నట్లు ఉంది

నా ముఖం మీద చెమట

పని గురించా లేక నా గురించా

ఏమో ఆదుర్దా


బాదం చెట్టు ఆకులు కాస్త ఊగాయి

పిల్లగాలి నా ముఖం మీద వీచింది

ఏదో తెలీని హాయి

అచ్చుం నువ్వు నోటితో ఉఫ్ అని నా ముఖం మీద

ఊదినట్టు

నువ్వంటే నన్ను కవ్వించేందుకు ఎన్నో చేస్తావ్


బాదం చెట్టు ఆకు మీద ఒక సీతాకోకచిలుక

నల్లగా మెరుస్తూ మధ్యలో అక్కడక్కడా కాస్త ఎరుపు రంగు 

అదే నీ పెదాల రంగులాగా

ఇంకాస్త గాలి వీచేసరికి ఆకు మీద సీతాకోకచిలుక ఎగిరిపోయింది

అచ్చు నీలాగా

కిటికీ మూసేసి పనిలో పడ్డాను


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Abstract