STORYMIRROR

Dinakar Reddy

Abstract Romance

4  

Dinakar Reddy

Abstract Romance

నిశ్శబ్దపు గోల

నిశ్శబ్దపు గోల

1 min
337

పొలాల్లో మట్టి వాసన

నా గుండెల్లో నీ జ్ఞాపకాల వాసన


నీ నవ్వులో

ఇళయరాజా సంగీతం విని

నాలోని చీకట్లు చెదిరిపోతున్నాయి

కొత్త ఆశలు చిగురిస్తున్నాయి


నీ జూకాల కదలికలతో

నా మనసు సయ్యాటలాడుతోంది

మన మధ్య బంధాన్ని కనుక్కోవాలని

ఐన్స్టీన్ సిద్ధాంతం ఒకటి తెగ తిరుగుతోంది


కుండల్లో దాచిన పాల మీగడ

మన ప్రేమను చూసి నవనీతంగా మారింది

వెన్న కన్నా మధురమైన నా మనసు 

సర్వం నీకర్పించమంటోంది


ఎక్కడున్నావు ప్రియా

బరువెక్కిన బ్రహ్మచర్యం 

ప్రతి రోజూ చేస్తోంది నిశ్శబ్దపు గోల

నీకు వినిపిస్తోందా

తిరిగొచ్చే ఆలోచన ఏమైనా ఉందా?



Rate this content
Log in

Similar telugu poem from Abstract