STORYMIRROR

Dinakar Reddy

Abstract Inspirational

4  

Dinakar Reddy

Abstract Inspirational

నేను కార్మికుడిని

నేను కార్మికుడిని

1 min
524

ఓ రోజు 

ఫ్యాక్టరీ సైరన్ విని పరుగెత్తే వాళ్ళలో ఒకణ్ణి


ఓ రోజు

అమాలీ అని పిలిస్తే పరుగెత్తే వాణ్ణి


ఓ రోజు 

పొలం పనుల్లో సాయానికి పనోణ్ణి


ఓ రోజు

కాలువ పూడిక తీసే వాణ్ణి


పనిబట్టి పేరు 

ఒక్కోసారి పేరు బట్టి పని


కష్టాలు రాబందులైనా

రేపటి మీద ఆశతో

చెమట చిందించే

అడ్డా మీద కూలీని

సారూ

నేను కార్మికుడిని

శ్రమను నమ్ముకున్న మార్మికుడిని


Rate this content
Log in

Similar telugu poem from Abstract