STORYMIRROR

SATYA PAVAN GANDHAM

Abstract Classics Others

4  

SATYA PAVAN GANDHAM

Abstract Classics Others

"తన కోసం"

"తన కోసం"

1 min
3.7K

తన ఊసులను స్మరిస్తూ...

తన ఊహలను భరిస్తూ...

తన ఆలోచనలతో విహరిస్తూ ...

తన ఆశలతో జీవిస్తూ ...

తన పిలుపుకై పరితపిస్తూ...

తన రాకకై ఎదురుచూస్తూ...

అంతకంతకూ దిగజారిపోతోన్న నా మనసుకనిపిస్తుంది,

చిరిగిన కాగితము అతికి వాక్యాలు రాయగలమా...?

పగిలిన కుండను పేర్చి నీళ్ళు నింపగలమా...?

వాడిన పువ్వులను చేర్చి పూజలు చేయగలమా...?

విరిగిన మనసును కూర్చి ప్రేమను పంచగలమా...?

అయినా నా హ్రుదయం దానికి దైర్యం చెప్తుంది

కిందకు వంగుతున్నంత మాత్రానా నింగి తలొంచినట్టాని...!

కాళ్ళను తాకుతున్నంత మాత్రానా కెరటం క్షమాపణలడిగినట్టాని...!

ఊరికే వస్తున్నంత మాత్రానా గాలి లోకువైనట్టాని...!

బరువును మోస్తూన్నంత మాత్రానా భూమి బానిసైనట్టాని...!

జీవితమే ఓ శాశ్వత ప్రయాణం కానప్పుడు,

ఆ ప్రయాణంలో ...

భాగాలైన ,

ప్రేమ - ద్వేషం

శాంతం - కోపం

ఓర్పు - అసూయ

తప్పులు - క్షమలు

మాత్రం శాశ్వతమా?

- సత్య పవన్



రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Abstract