STORYMIRROR

VENKATALAKSHMI N

Abstract Fantasy Others

4  

VENKATALAKSHMI N

Abstract Fantasy Others

దేవీ నవరాత్రులు

దేవీ నవరాత్రులు

1 min
307

దసరా వచ్చిందోయ్

సరదా తెచ్చిందోయ్

సెలవులతో సందడే

మాఇంట నెలకొందోయ్

ముచ్చటగా అందరూ

మురిపెంగా ముస్తాబై

దుర్గమ్మ పూజచేయ

నవరాత్రుల సందడినే

ఇంటింట వెలుగొందెనోయ్

సకల జనుల సౌభాగ్యవతి

కరుణించే కల్పవల్లి

ఆదరించే ఆదిశక్తి

దుష్టశిక్షణకై అవతరించే

శిష్టరక్షణకై భువినేతెంచె

బొమ్మల కొలువులతో

శమీవృక్ష పూజలతో

వాడవాడలా వైభవంగా

దేశవ్యాప్తంగా దేవీనవరాత్రులు

భక్తుల హృదయాన

ఆధ్యాత్మిక పారవశ్యాలు

పిల్లల కేరింతలు

ముత్తైదువుల పేరంటాళ్ళు

దసరా మామూళ్ళ వసూళ్ళు

బాణాసంచాల సందళ్ళు

అంబరాన్నంటే దసరా ఉత్సవాలు


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Abstract