STORYMIRROR

VENKATALAKSHMI N

Tragedy Fantasy Others

4  

VENKATALAKSHMI N

Tragedy Fantasy Others

మానవ జన్మ

మానవ జన్మ

1 min
264

దేహానికి తప్ప

దాహానికి పనికి రాని

ఆ సముద్రపు కెరటాలే

ఎగసిఎగసి పడుతుంటే

నీ కష్టం ముందు అన్నీ బలాదూరే

తలుచుకుంటే నీ తలరాత

ఇంతే అన్న వాళ్ళముందు

తల ఎత్తుకునేలా

అనుకున్నది సాధించు

ఉద్యోగం పోయిందని

వ్యాపారం దెబ్బ తిందని

స్నేహితులు మోసం చేశారని

ప్రేమ విఫలమైందని

అలాగే వుండి పోతే ఎలా

అడుగు ముందుకేయాలి

అంతే కానీ ఒకేచోట

కదలకుండా వుండకు

కుదిరితే నడు లేదా

పరుగెత్తు లేదా పాాకు

ఉత్కృష్టమైనమానవ

జన్మను సార్థకం గావించు


Rate this content
Log in

Similar telugu poem from Tragedy