స్వేచ్ఛా వాయువులు
స్వేచ్ఛా వాయువులు
ఎన్నాళ్ళయిందో ప్రకృతి
పచ్చదనం పరుచుకుని
ఎన్నాళ్ళయిందో పక్షులు
స్వేచ్ఛ గా విహరించి
ఎన్నాళ్ళయిందో
నదీమ జలాలు
పారదర్శకతను సంతరించి
ఎబోలా నిఫా అంటూ
రకరకాల పేర్లతో భయపెట్టిన
నీ జాతిని బెదిరిపోయేలా
చేసిన ధన్వంతరి వారసులం
నీ సవాల్ ఒక లెక్క కాదు
రణరంగం లో వెన్ను చూపడం తెలీని వీరులం
స్వీయ నియంత్రణే కవచంగా
పరిశుభ్రతే ఆయుధంగా మలిచాం
ఓరిమితో ఓటమిని జయించడమే
ఆశయంగా సాగుతున్నాం
గెలుపు నీదేనని విర్రవీగకు
పరాజితగా పలాయనం
చిత్తగించక తప్పదు
మా ఆత్మస్థైర్యం ముందు
తలవంచక తప్పదు
మా చైతన్యం ముందు
చతికిల పడక తప్పదు
కరోనా..నీ కట్టడి కై
దీక్ష పూనాము
నిను అంతం చేయ
సంకల్పించాము
నా దేహం నా దేశం
శుచి శుభ్రతకు నిలయం
నీ పతనం తప్పదిక
ఐకమత్యమే మా బలమని తెలుసుకో
విడగొట్టాలని చూస్తే పడగొడతామని తెలుసుకో
