Dinakar Reddy

Abstract Comedy Drama

4  

Dinakar Reddy

Abstract Comedy Drama

వాస్తు వివరం

వాస్తు వివరం

1 min
282


మీ ఇంటికి వాస్తు బాగోలేదు. అందుకే మీ శ్రీవారు ఎక్కువగా సంపాదించలేకపోతున్నారు. మేము చెప్పినట్లు చేయండి అంటూ టీవీలో చెప్పేది జాగ్రత్తగా వ్రాసుకుంటోంది విమల.


భర్త ఆఫీసుకు వెళ్ళగానే వంటింట్లో సామాన్లు మొత్తం బయట పెట్టి ఏవో లెక్కలు వేస్తోంది. ఈలోగా వచ్చిన పనివాళ్ళు వంటింటి బయట తవ్వడం మొదలు పెట్టారు.


విమల మళ్లీ టీవీ పెట్టింది. వంటింటి వెనుక తవ్వకం ప్రారంభించేటప్పుడు ముందుగా ఎండు మిరప కాయలతో దిష్టి తీయాలి అని చెప్తున్నారు.


విమల పనివాళ్లని ఈరోజుకి వెళ్ళిపొమ్మని చెప్పింది. రేపు దిష్టి తీసి మళ్లీ పని చేయించాలని సామాన్లు సర్దుకుంది.


వంటిల్లు వెనుక తవ్విన చోటు నుంచి ఎలుకలు ఇంట్లోకి వచ్చి తిష్ట వేసాయి. 


ఇక ఆరోజు రాత్రంతా ఎలుకల గురించి గొడవ. మరుసటి రోజు భార్యా భర్తలిద్దరూ వాస్తు గురించి గొడవ.


ఈసారి విమల టీవీ పెట్టగానే ఎలుకల బెడద నుండి ఎలా బయట పడాలి అనే కార్యక్రమం వస్తోంది.


Rate this content
Log in

Similar telugu story from Abstract