Dinakar Reddy

Abstract Inspirational Thriller

4  

Dinakar Reddy

Abstract Inspirational Thriller

వాంఛ

వాంఛ

1 min
673


దృఢమైన శరీరం ఒకటి అటుగా నడిచి వెళ్ళింది. నేను హోటల్లో కూర్చుని రోడ్డు వైపు చూస్తూ ఉన్నాను. తింటున్నంతసేపూ నేనూ దృఢమైన శరీరం కలిగి ఉండాలని ఆశించాను. అది సహజమే కదా. 


నేను తినడం పూర్తయ్యి బిల్ కోసం ఎదురు చూస్తున్నాను. ఇంతలో ఒక వ్యక్తి వంగినట్లు నడుస్తూ వెళుతున్నాడు. బహుశా గూని వంటి స్థితి కావచ్చును. అయ్యో! ఎంతటి కష్టం అని అనుకున్నాను.


బిల్ తీసుకుని బయటికి వెళుతూ చూశాను. ఒకావిడ ఏడు వారాల నగలను అలంకరించుకుందా అన్నట్లు ధగధగ మెరిసే నగలతో కూర్చుని ఉంది. అబ్బా! ఎంత బంగారం. ఏం కథ. మన దగ్గర ఒక బంగారు గొలుసు కూడా లేదే అని అనుకున్నాను. 


ఇక హోటల్ గేట్ దగ్గరకి వచ్చాను. అందులోంచి పక్కకి చూస్తే లోపల పాత్రలు శుభ్రం చేసే మనుషులు కనిపించారు. వాళ్ళలో ఒక ముసలమ్మ వణుకుతున్న చేతులతో పాత్రలు కడుగుతూ, పక్కన వాళ్ళు మాట్లాడే మాటలకు కాబోలు నవ్వుతూ ఉంది.


నేను నడుచుకుంటూ వెళుతున్నాను. ఎన్నో వాంఛలు. దృఢమైన శరీరం చూసినప్పుడు ఆ వ్యక్తి స్థితి నాకు తెలియలేదు. కానీ నేను అలాంటి శరీరం కావాలనుకున్నాను. గూని వ్యక్తిని చూసినప్పుడు అతని శరీరం పడే కష్టాన్ని చూశాను. కానీ అతను ధైర్యంగా ఒక్కడే చేస్తున్న ప్రయాణాన్ని గురించి ఆలోచించలేదు.


బంగారు నగలతో ఉన్నావిడను చూసి బంగారం కావాలనుకున్నాను. ఆమె ముఖం నేను గమనించలేదు. వణుకుతూ రెక్కల కష్టం మీద పని చేస్తున్న ముసలమ్మ ముఖంలో చిరునవ్వును నేను ఆస్వాదించలేదు.


ఏదో కావాలి. ఒకటి పోతే ఇంకోటి. ఏది కనిపిస్తే అది. తీవ్రమైన వాంఛ. వీటిని ఆపేదెలా. అయినా అసలు ఎందుకు ఆపాలి అని మళ్లీ ప్రశ్న. ఒకవేళ ఆపాలనుకున్నా ఎలా. అది సాధ్యమేనా. మళ్లీ ప్రశ్న. 


పక్కన అమ్మవారి గుడిలో గంట మ్రోగినట్లుంది. నా ఆలోచనలు ఎక్కడివక్కడే ఎగిరిపోయాయి.


"మోక్ష మార్గాలు సూచించు బంగారు కలలన్నీ నెరవేర్చు నీ గానమే, 

మేల్మరువత్తూరుకే మహరాణివే, 

గుణవతులు తలచుకును పార్వతివే" అని నేను రోజూ వినే పాటను పాడుకుంటూ ముందుకు నడిచాను.



Rate this content
Log in

Similar telugu story from Abstract