తీపి జ్ఞాపకాలు
తీపి జ్ఞాపకాలు


ఆగస్ట్ 12. ఇది కేవలం ఒక రోజు కాదు ఒక తీపి గుర్తుగా ఉండే రోజు. ఎందుకంటే ఎన్ని రోజులు ఎన్ని గొడవలు పడ్డా ఆ ఒక్క రోజు మాత్రం చాలా ఆనందంగా ఉంటారు. ఇలాంటి ఒక తీపి గుర్తు నాకు ఒకటి ఉంది.
ఆ రోజు రాఖీ పండుగ సంవత్సరం పాటుగా మాట్లాడని మా చెల్లి రాఖీ రోజు వచ్చి రాఖీ కట్టింది. ఒక సమయం లో మేము ఎలా ఉందేవలమో తెలుసా?. ప్రతి చిన్న విషయానికి గొడవ పడేవలము.నాకు ఇంకా బాగా గుర్తు ఏమిటంటే ఒక రోజు తన 10th పరీక్ష పేపర్ దాచి ఉంచి ఆ రోజు మొత్తం తనని ఏడిపించిన తర్వాత రోజు నేను బాధపడి తనను క్షమించమని అడిగాను. ఇంకొక విషయం మా ఇద్దరి మధ్య ఎప్పుడు చదువులో పోటీ వుండేది. ఆ పోటీ మా మధ్య ఇప్పటికీ సాగుతూనే ఉంది.