Karthik son of god
Karthik son of god
కార్తీక్
THE SON OF GOD
ఈ కథ మీకు చాలా సంతోషాన్ని ఇస్తుంది. ఎందుకంటే ఈ కథ అంతా సంతోషముగా ఉంటుంది.
ఈ కథ కాశ్మీర్ లో మొదలైంది. మన ఈ కథలో హీరో వచ్చేసి కార్తీక్. ఇతను ఒక సోల్జర్.ఇతను ఇప్పటి వరకు చేసిన ఏ మిషన్ unsuccessful కాలేదు. ఒక సారి కాశ్మీర్ బోర్డర్ లో ఉన్న విలేజెస్ లో అలర్లు మొదలయ్యాయి. ఇది చేసేది మొహ్మద్ బాషా అనే పాకిస్తాన్ టెర్రరిస్ట్. అందులో భాగంగా ఇండియన్ soldiers ఇచ్చే లోపే 30మంది ఊరి ప్రజలను చంపేశాడు. ఇక ఆ మొహ్మద్ బాషా సుఖదేవ్ అనే వ్యక్తిని వెతుకుతున్నాడు. కార్తీక్ మరియు అతని ఫోర్స్ అక్కడికి వచ్చింది. కానీ మహ్మద్ కనిపించలేదు. కార్తీక్ మరియు అతని టీమ్ మొహ్మద్ నీ సీక్రెట్ గా కొంచెం కూడా సౌండ్ లేకుండా వెతుకుతున్నారు.
ఇంతలో సుఖదేవ్ నీ మొహ్మద్ పట్టేసుకున్నడు. ఆ మొహ్మద్, సుఖదేవ్ నీ చంపెయ్యడానికి గన్ తీసాడు. ఇంతలో వెనుకనుంచి కార్తీక్ మొహ్మద్ పై దూకాడు. ఆర్మీ ఫోర్స్ సుఖదేవ్ నీ తీసుకొని వెళ్ళారు. కార్తీక్ మొహ్మద్ నీ కొడుతున్నాడు. మొహ్మద్ కి భాగా గాయాలు అయ్యాయి. ఇక తట్టుకోలేక మొహ్మద్ అక్కడ నుండి అడవి లోపలికి పరుగులు తీసాడు. వీలైనంత దూరం కార్తీక్ కూడా వెళ్ళాడు. కానీ అడవి మధ్య భాగానికి వచ్చేసరికి తప్పించుకొని పోయాడు. ఇక కార్తీక్ వెనక్కి వచ్చాడు.
సుఖదేవ్ కి ట్రీట్మెంట్ ఇచ్చి ఆ రోజుకి రెస్ట్ తీసుకోమని చెప్పారు.తర్వాత రోజు కార్తీక్ తన దగ్గరికి వెళ్ళి ఇలా అడిగాడు,
" MR. SUKHDEV ఆ మొహ్మద్ మిమ్మల్ని ఎందుకు అంతగా వెతికి చంపాబోయాడు?"
"సార్ నేను ఇంటర్నేషనల్ లాబ్ లో ఒక సీనియర్ సైంటిస్ట్ నీ. ఒక జబ్బుకు మెడిసిన్ కనిపెట్టాలనీ ఒక ఊరికి వెళ్ళాను అక్కడ నాకు ఒక పాత గుడి కనిపించింది , అయితే పైకి వెళ్దాం అని మెట్టుపై కాలు పెడుతుంటే ఒక ముని నన్ను వెన్నకి లాగి నేను వచ్చిన పని గురించి అడిగాడు. నేను ఇచ్చిన విషయం చెప్పాను. ఆ ముని కళ్ళు మూసుకొని ఏదో ఆలోచించుకొని నన్ను ఆ ముని అడవిలో ఉన్న తన ఇంటికి తీసుకొని వెళ్ళాడు. అప్పుడు అతను నాకు ఒక మొక్క ఇచ్చాడు. దాన్ని నేను లాబ్ కి తీసుకెళ్ళి పరిశోధన చేశాను.అప్పుడు ఆ చెట్టు వల్ల ఒక ఎలిమెంట్ తయారు అయ్యింది. అది కొన్ని లిక్విడ్స్ రియాక్షన్ వాళ్ళ ఒక చిన్న బ్లాస్ట్ వచ్చింది.ఈ experiment లో మేము వాడింది ఒక చిన్న ఆకు మాత్రమే.అదే ఒక చెట్టు తో చేస్తే ఇండియా మొత్తం అంతం అయిపోతుంది.అందుకే ఆ మొహ్మద్ నా కోసం వచ్చాడు."అని చెప్తాడు
sukhdev.
"ఆ మొక్క ఇప్పుడు ఎక్కడ ఉంది?" అని కార్తీక్ ప్రశ్నించాడు.
"మొక్కను మేము అంతం చేశాం",అని sukhdev అన్నాడు.
"అయితే ఇక problem solve . మీరు ఇక వెళ్ళి రెస్ట్ తీసుకోండి," అని అంటాడు కార్తీక్.
"అసలు problem ఇప్పుడే మొదలైంది. ఆ మొక్కను అంతం చేయగలిగాం కానీ ఆ మొక్కకు సంభందించిన చెట్టుని ఎం చెయ్యలేము. ఎందుకంటే అది ఒక గుడిలో చాలా భద్రం గా ఉంది. వీలైనంత త్వరగా మీరు దాన్ని అంతం చెయ్యండి",అని Sukhdev అంటాడు.
కార్తీక్ అప్పుడు,"సరే మేము చూసుకుంటాం లే"అని అంటాడు.
కార్తీక్ దీని గురించి అతని హై కమాండ్ కి చెప్తాడు. ఆ హై కమాండ్ కొంత సేపు ఆలోచించి ఆ చెట్టుని వెతికి పట్టుకునే పని కార్తీక్ కి ఇచ్చింది.
కార్తీక్ వెంటనే దాన్ని అతని భాద్యతగా స్వీకరించి వెంటనే బయలుదేరుతాడు.
అలా తన ప్రయాణం తనను ఉత్తరప్రదేశ్ కి తీసుకొని వెళ్ళింది. దారిలో ఒక BULLDOZER game నడుస్తుంది. కార్తీక్ బైక్ దిగి వాళ్ళ దగ్గరకు వెళ్ళి దారిమధ్యలో bulldozer game పెట్టినందుకు గొడవ పెట్టుకున్నాడు. అయితే bulldozer game పెట్టినవారు ఇలా అన్నారు,
"hello స్టైలిష్ బుల్లెట్ మీద ఓస్తే సరిపోదు మగతనం కూడా ఉండాలి. ఇదిగో ఆ లింగాన్ని చూడు. ఎంట్రీ ఫేస్ 3,000 కట్టి ఈ గేమ్ లో గెలిచిన వాడికి ఆ లింగం ఇస్తాం.నువ్వు దమ్ముంటే ఇందులో గెలుపు రోడ్ క్లియర్ చేస్తాం"అని అన్నాడు.
కార్తీక్ కి కోపం వచ్చి సవాల్ కి ఒప్పుకున్నాడు. కార్తీక్ బరిలోకి దిగాడు. ఎద్దుకి ఎక్కువ డోస్ ఇచ్చి కార్తీక్ పై ఎద్దుని ఒడిలారు. ఎద్దు వెళ్ళి తన కొమ్ములతో కార్తీక్ నీ పొడవనికి వచ్చింది. కార్తీక్ దాని కొమ్ములు పట్టుకొని ఆపడానికి ప్రయత్నం చేశాడు. కానీ అది అస్సలు లొంగలేదు.ఇక లాభం లేక కార్తీక్ తన చేతి రెండు వెలతో ఎద్దు యొక్క కొంతు భాగం లో గుచ్చాడు. ఆ నొప్పి తట్టుకోలేక అటూఇటూ ఊగుతూ, రంకెలు వేస్తూ కుప్పకూలి పోయింది. అందరూ దీన్ని చూసి ఆశ్చర్యపోయారు.
చెప్పిన విధం గా కార్తీక్ కీ ఆ లింగాన్ని ఇవ్వడం ఇస్తాం లేక పోయినా ఇచ్చారు.
"అన్న ఏంటి ఆ లింగం వాడికి ఇచ్చావ్. దాన్ని ప్రైజ్ గా పెట్టీ అందరినీ మోసం చేస్తూ డబ్బులు సంపాదిస్తున్న కదా…ఇప్పుడు ఎలా అన్న?"అని BULLDOZER GAME పెట్టిన వారిలో ఒకలు చెప్తారు.
దీనికి కొద్దిసేపు ఆలోచించి "బాధపడకు రా ఇవాళ రాత్రికే వాడిని చంపైన ఆ లింగం మన సొంతం చేసుకుందాము"
అని వారిలో ఒకలూ అంటారు.
కార్తీక్ ఆ లింగాన్ని జాగ్రత్తగా తన బ్యాగ్ లో పెట్టుకొని అక్కనుంచి వెళ్తాడు. అలా కొంత సేపటికి చీకటి కమ్మింది. ఆ గ్యాంగ్ అక్కడ కాపు కాసింది.కార్తీక్ ఆ స్పాట్ కి వచ్చాడు. అనుకున్న విధంగా గా బైక్ tyre puncher చేశారు. ఆ గ్యాంగ్ కార్తీక్ మీదకు కర్రలు పట్టుకొని వచ్చారు. కార్తీక్ నీ రక్తం వచ్చేలా కొట్టారు. కార్తీక్ నీ చంపేసి లింగం తీసుకొని వెళ్ళాలి అని అనుకొని ఒకడు కత్తి పట్టుకొని వస్తుండగా మిగిలినవాళ్ళు కార్తీక్ నీ గట్టిగ పట్టుకున్నారు. కార్తీక్ ఒక్కసారిగా కోపంతో వారందరినీ విసిరేసి కత్తి పటుకొని వచ్చేవాడిని కొట్టాడు. అలా వాడి గంగ్ మొత్తాన్ని కొట్టాడు.వారు తట్టుకోలేక పరుగులు తీశారు. Puncher అయిన బైక్ అక్కడే ఒడిలేసి అలా నడుస్తూ ఒక చోటికి వెళ్తాడు . అక్కడ మొత్తం పండగ ఏర్పాట్లూ జరిగే వాతావరణం కనిపిస్తుంది.
కార్తీక్ ఒక ముసలి వ్యక్తి దగ్గరకు వెళ్లి ఇలా అన్నాడు," తాతగారు! ఇక్కడ ఏం జరుగుతుంది? ఈ ఏర్పాట్లూ దేనికి?"
ఆ ముసలి వ్యక్తి," బాబు ఇంకొక 4 రోజుల్లో శివరాత్రి వస్తుంది.ఈ శివరాత్రికి అదిగో ఆ కొండపైన కనిపించే గుడిలో నుంచి ఒక జ్యోతి వస్తుంది.ఇలా ఆ జ్యోతి 1000 సంవత్సరాలకు ఒక సారి వస్తుంది. మా అదృష్టం కొద్ది ఆ రోజు ఇంకొక 4 రోజుల్లో ఉంది".
అప్పుడు కార్తీక్ కి Dr.SUKHDEV చెప్పిన విషయం గుర్తు వస్తుంది. పక్కనే ఉన్న వాగులో స్నానం చేసి శివున్ని చూద్దామని వెళ్తాడు. తను దర్శనం చేసుకుంటూ ఉండగా తనకు ఒక శివ స్తోత్రం వినపడుతుంది. దాన్ని వింటూ అలా ఒక చెట్టు క్రిందికి వెళ్ళి పడుకుంటాడు.
తర్వాత రోజు అక్కడ నుంచి ప్రయాణం మొదలుపెడతాడు. అలా నడుస్తూ నడుస్తూ అడవి దగ్గరికి వస్తాడు.తను తన లక్ష్యాన్ని చేరుకున్నాడు అని అనుకొని అడవిలోపలికి వెళ్తాడు. దారి మధ్యలో కొంచెం సేపు అగుడం అని అనుకొని బ్యాగ్ పక్కన పెట్టుకొని టెన్త్ వేసుకుంటాడు. అలా పక్కన ఉన్న నది దగ్గరకు వెళ్తాడు. ముఖం కడుకుంటూ ఉండగా పొదల చాటు నుంచి ఏదో ఒక రకమైన అలజడి వస్తుంది.కొంత సమయానికి తన చుట్టూ ఎవరో దాగి దాగి పరిగెత్తున్నట్లుగా శబ్దాలు వస్తున్నాయి.కార్తీక్ నిల్చొని తన చుట్టూ పరిశీలించాడు. ఎవ్వరు కనిపించలేదు ఒక్కసారిగా వెనుకనుంచి ఎవరో కట్టిగా కర్రతో కొట్టి దాక్కున్నారు. కార్తీక్ కి ఏమీ అర్దం కావడం లేదు. ఒకేసారి ఒక పొద చాటునుంచి ఎవరో ఉర్దూలో పాట పడుతున్నట్లుగా వినిపిస్తుంది. వచ్చింది మహ్మద్ బాషా అని కార్తీక్ కి అర్ధం అయ్యింది. "మహ్మద్ వచ్చింది నువ్వే అని నాకు తెలుసు దాకున్నది చాలు ఇక బయటకి రా"అని కార్తీక్ అన్నాడు. "శభాష్ ఇండియన్ ఆర్మీవాని అనిపించుకున్నవు.అయితే నిలో నిజంగా దమ్ము ధైర్యం ఉంటే నన్ను పట్టుకో.లేకుంటే నిన్ను నేను చంపేసి ఆ మొక్కను నా వశం చేసుకుంటాను." అని చెప్పాడు. ఇక మొహ్మద్ మనుషులు పొదల చాటున పరుగులు తీస్తూ గాల్లో ఫైరింగ్ చేస్తూ ఉన్నారు. కానీ వారికి తెలియని విషయం ఏమిటంటే కార్తీక్ ఇలాంటి మిషన్స్ చాలా చేశాడు. ఇక కార్తీక్ గన్ తీసి ఫుట్ స్టెప్స్ ఎటు నుంచి వస్తున్నాయో అటువైపుగా గన్ తో షూట్ చేశాడు. ఇక అంతే 5నిమిషాల్లో అందరినీ చంపేశాడు. ఇక మొహ్మద్ చెట్టు పై నుంచి కార్తీక్ మీదకు దూకి కార్తీక్ పై దాడి చేస్తున్నాడు.కార్తీక్ ఒక్కసారిగా లేచి మొహ్మద్ నీ కొట్టాడు. ఇద్దరిమధ్య బికర యుద్ధం జరుగుతుంది.ఇంతలో నది అవతల పక్కనుంచి పెద్ద గాండ్రింపు వినిపించింది. మొహ్మద్ మరియు కార్తీక్ వాళ్ళ కొట్లాట ఆపి అటు చూశారు.పొదల మధ్య నుంచి పెద్ద సింహం భయంకరమైన అడుగులు వేస్తూ వస్తుంది. మొహ్మద్ గన్ తీసుకొని దాన్ని కాల్చబోయాడు. సింహం దాన్ని చూసి మొహ్మద్ పైకి దూకింది. కార్తీక్ పక్కన వున్న కట్టెను తీసుకొని సింహాన్ని కొట్టి మొహ్మద్ నీ కాపాడాడు.సింహం మళ్ళీ పైకి లేచింది కార్తీక్ బ్యాగ్ తగిలించుకొని మొహ్మద్ చెయ్యి పట్టుకొని పరుగులు తీసాడు. సింహం వారి వెనుకే వస్తుంది. వీరి పరుగు ఆగలేదు.పరిగెత్తుతూ పరిగెత్తుతూ మధ్యలో మొహ్మద్ ఇలా అన్నాడు,“ నేను ఒక పాకిస్తాన్ వాడిని అని తెలిసి కూడా ఎందుకు నన్ను ఆ సింహం దగ్గర నుంచి కాపాడి ఇలా తీసుకొని వచ్చావ్?"
అయితే దానికి కార్తీక్,“ నువ్వు ఎవడివైతే నాకేంటి. ఆపదలో ఉన్నవారిని కాపాడటమే భారతీయుడికి తెలిసిన సిద్దాంతం". ఇది విన్న మొహ్మద్ ఆశ్చర్య పోయాడు. ఇక పరుగులు తియ్యడం తన వల్ల కాక అగి వెన్నకి తిరిగాడు. సింహం తనకి 4 అడుగుల దూరంలో నిల్చుంది. కార్తీక్ వైపు కసిగా చూస్తూ గర్జించింది. మొహ్మద్ నీ వెళ్ళమని కార్తీక్ సైగ చేసాడు. మొహ్మద్ చిన్నగా వెనక్కి అడుగులు వేస్తూ వెళ్ళిపోయాడు.కార్తీక్ సింహం కాళ్ళోకి ధైర్యంతో చూశాడు . కార్తీక్ అలాగే చూస్తూ ముందుకి అడుగు వేశాడు సింహం కూడా అలానే కార్తీక్ కల్లోలో చూస్తూ వెనక్కి అడుగు వేసింది. అలా కార్తీక్ తన కంటి చూపుతో భయపెట్టాడు.సింహం మళ్ళీ తిరిగి అడవిలోకి వెళ్ళిపోయింది.
కార్తీక్ ఇక అలిసిపోయి అక్కడే పడుకున్నాడు.
తెల్లవారింది.పక్షులు కిల కిల మంటు ఆకాశంలో ఆహారం కోసం వెతుకులాటకి
వెళ్ళాయి. కార్తీక్ నిద్రలేచాడు. అలా మళ్ళీ అడవిలో ప్రయాణం మొదలుపెట్టాడు. ఎన్నో కిలోమీటర్ల ప్రయాణం చేశాడు. చివరకు గుడి దగ్గరకు వచ్చాడు. స్నానం చెయ్యకుండా లోపలికి వెళ్లారు అనే పద్ధతి గుర్తువొచ్చి స్నానం చెయ్యడానికి వెళ్ళాడు. అలాగే భోజనం కూడా చేసి బ్యాగ్ ఒక చెట్టుకింద పెట్టాడు. గుడి మెట్లపై అడుగు పెడుడం అని అనుకొని పెట్టబోయే లోపే ఒక ముని తన చెయ్యి అద్దం పెట్టీ హెచ్చరించాడు. ఆ ముని కార్తీక్ మెల్లో ఉన్న లాకెట్ చూసి తన ఇంటికి తీసుకొని వెళ్ళి గుర్చోపెట్టాడు.
"స్వామి నన్ను ఇక్కడకు ఎందుకు తీసుకొని వచ్చారు? నాకు అవతల చాలా పెద్ద పని ఒకటి ఉంది.నేను వెళ్తాను"అని కార్తీక్ అంటాడు.
"నువ్వు నీకు గా ఇక్కడికి రాలేదు. ఆ భగవంతుడే నిన్ను ఇక్కడికి వచ్చేలా చేశాడు రాజా సురేందర్"అని ముని అంటాడు.
"ఏంటి దేవుడు నన్ను ఇక్కడికి తీసుకొచ్చాడు! అసలు రాజా సురేందర్ ఎవరు? నేను కార్తీక్.నా అసలు పేరు ఇదే"అని కార్తీక్ అంటాడు.
"కాదు ఇది నీ మరో జన్మ. మొదటి జన్మలో నువ్వు సురేందరుడివి . దానికి ఆధరమే నీ మెళ్లో ఉన్న ఈ లాకెట్."అని ముని చెప్తాడు.
"అసలు నేను ఎవరు? రాజా సురేందర్ కి నాకు సంబంధం ఏంటి? దేవుడు నన్ను ఇక్కడికి వచ్చేలా చెయ్యడం ఏంటి? నా సందేహాలు తీర్చండి స్వామి" అని కార్తీక్ అన్నాడు.
"నీ ఈ సందేహాలన్నీ తీరాలంటే రాజా సురేందర్ గురించి అంటే నీ మరు జన్మ గురించి తెలుసుకోవాలి"అని ముని అంటాడు.
ఇక ముని ఆ కథ చెప్పడం మొదలు పెడతాడు……
CHAPTER -2
సురేందరుడు
అది 9వ శతాబ్దం. బ్రహ్మ దేవుడు తల రాతలు రాస్తూ ఉన్నాడు. అదే సమయంలో మహాదేవుడు శివుడు మరియు విష్ణువు కలిసి వచ్చారు.
" మహాదేవునికి మరియు విష్ణుమూర్తికి ప్రణామాలు. మీరు నా దగ్గరకు రావడం వెనుక ఉన్న ఆంతర్యమేమిటి దేవ"అని బ్రహ్మ అడిగాడు.
"ఏమీ లేదు బ్రహ్మదేవ మా ఇద్దరి శక్తులు కలిపి ఒక మొక్కను సృష్టించాము. ఈ మొక్క వల్ల రాబోయే కాలంలో కొన్ని దుష్టులను సంహరించడానికి ఈ మొక్క సాయపడుతుంది. ఈ మొక్క వల్ల అమృతం లభిస్తుంది మరియు విషము లభిస్తుంది. అందుకే ఇది అసురుల దగ్గరకు వెళ్లకుండా చూసుకో. ఒక వేళ వెళ్తా ఈ సృష్టి మొత్తం నాశనం అయిపోతుంది"అని శివుడు అంటాడు.
బ్రహ్మదేవుడు ఆ మొక్కను తీసుకుంటాడు. శివుడు మరియు విష్ణువు మయం అవుతారు. బ్రహ్మదేవుడు ఆ మొక్కను తీసుకెళ్ళి తన రహస్య మందిరంలో దాచి పెడతాడు. ఆ మొక్కను దేవుడు మంచికోసం పుట్టించిన దాన్ని చెడు దారిలో వాడాలని ఆలోచన ఉన్న రాక్షసులు చాలామంది ఉన్నారు. అయితే వారిలో ఒకడు యమకాసురుడు. ఇతను ఇప్పటి వరకు ఎన్నో శక్తులు పొందాడు. అయినా తనకు అమృతం లభించలేదు అనే లోటు ఉండేది. ఆ లోటు ఇప్పుడు ఆ మొక్కవల్ల తీరుతుందని తెలిసి బ్రహ్మదేవుడిపై యుద్దానికి వెళ్తాడు. బ్రహ్మదేవుడు వెంటనే ఆ మొక్కను కాపాడాలని ఆ మొక్కను తీసుకొని కైలాసం వైపుగా వెళ్తాడు. అకస్మాత్తుగా నారదముని ప్రత్యక్షమవుతాడు. ఆ మొక్క బ్రహ్మ దేవుడి చేతిలో నుంచి కింద పడిపోతుంది.అదే సమయంలో భూలోకంలో భీకర వర్షం మొదలైంది. ఆ మొక్క పిడుగుల వచ్చి ఉత్తరాఖండ్ లో ఉన్న రుద్రప్రయాగ అనే ఊరిలో పడింది. బ్రహ్మ, శివుడి దగ్గరకు వెళ్ళి జరిగిన విషయం చెప్తాడు.
అప్పుడు శివుడు ఇలా అంటాడు,
"చింటించకు దేవ అసలు ఆట ఇప్పుడే ప్రారంభం అయ్యింది. ఆ మొక్కను కాపాడడానికి ఒక యోధుడు వస్తాడు".
తర్వాత రోజు శ్రీ మహావిష్ణువు , మహాదేవుడు మరియు బ్రహ్మ కలిసి భూలోకానికి వస్తారు. ఆ చెట్టుకి రక్షణ గా చుట్టూ ఒక కవచ గోడను నిర్మిస్తారు. ఆ గోడ ద్వారం తెరవడానికి మహా శక్తి గల లింగాన్ని శివుడు తయారుచేసి ఒక మునికి ఇస్తాడు. ఆ మునిపేరు యోగిశర్మ. శివుడు తర్వాత జంబాల రాజ్యపు రాజు దేవదత్తుడినీరక్షకుడిగా నిర్మిస్తారు. తనకు సహాయంగా శివుడు ఒక నందిని మరియు విష్ణువు ఒక గద్దనీ నిర్మిస్తాడు. ఇక త్రిమూర్తులు వెళ్ళిపోతారు. దేవదత్తుడు తన కార్యం తను చేస్తున్నాడు.
కొన్ని సంవత్సరాలకు యోగిశర్మనీ కొంతమంది అడవిదొంగలు చంపేసి ఆ లింగాన్ని దొంగలిస్తారు. ఆ లింగం ఎక్కడో తప్పిపోయింది. ఆ గుడి అలాగే మూతపడి ఉంది. అన్ని మారుతున్నాయి. 10వ శతబ్దo లోకి అడుగు పెట్టబోతున్న భూలోకానికి యమకాసురుడు వచ్చాడు. దేవదత్తుడు యమకాసురిడితో యుద్దానికి దిగాడు. యమకాసురుడు ,దేవదత్తుడి తల నరికేశాడు. నంది మరియు గద్ద తనని ఆపడానికి వెళ్తే యమకాసురుడు తన శక్తులతో వాటిని శిలగా మార్చాడు.
బ్రహ్మ దీన్ని చూసి ఈసారి వైకుంఠానికి పరుగులు తీశాడు. బ్రహ్మ విష్ణువు దగ్గరకు వెళ్ళాడు.
"బ్రహ్మ దేవ ఏంటి ఇలా వచ్చారు"అని విష్ణు అన్నాడు.
"స్వామి . మీరు మహావృక్షం అన్నారు, రక్షకుడు వచ్చి దాన్ని రక్షిస్తాడు అన్నారు. కానీ ఎక్కడ ఆ రక్షకుడు. ఇప్పుడు అతను చనిపోయాడు"అని బ్రహ్మ అన్నాడు.
విష్ణువు చిలిపి నవ్వులు నవ్వుతూ,"బ్రహ్మ దేవ ఆ రక్షకుడు ఇంకా ఇక్కడికి రాలేదు. యమకాసురిడిని భూలోకానికి తెప్పించడానికి ఆ దేవదత్తుడిని నిర్మించాం. ఆ రక్షకుడు త్వరలోనే రాబోతున్నాడు"అని సమాధానం ఇచ్చాడు.
భూలోకంలో యమకాసురుడు ఆ తలుపులు భద్దలు కొట్టాలని ప్రయత్నించి తన శక్తులు ప్రదర్శించాలి అని అనుకొని తను శక్తి ప్రదర్శించబోయాడు. ఒక్కసారిగా ఆకాశంలో పెద్ద మెరుపు మెరిసింది. యమకాసురుడు అంతటితో ఆగి పైకి చూశాడు. భయంకరమైన మెరుపుల మధ్యలో నుంచి ఒక గుర్రంపై కండలు తిరిగిన వీరుడు , శూరుడు తన చేత మహా శక్తివంతమైన కత్తిని పట్టుకొని కనిపించాడు. బ్రహ్మ అతన్ని చూసి సంతోషించాడు. ఆ ఆకాశంలో వచ్చిన వాడిపేరు సురేందరుడు. ఆ సురేందరుడు ఒక్కసారిగా భూమిపై దూకుతాడు ఆకాశంలో నుంచి.తన దూకుడికి భూమి మొత్తం ఒక్కసారి సవరించినట్లు అవుతుంది.
యమకాసురుడు అతని వైపు చూస్తూ,"ఎవరు నువ్వు? నీకు ఇక్కడెంటి పని"అని అంటాడు.
అప్పుడు సురేందరుడు ఇలా అంటాడు,
" చండ, ప్రచండ, ఆచండ రుపంకలిగి, దమ్ముధైర్యం నా నరనరాల్లో ప్రవహిస్తూ , కంట్లో ఎప్పుడు వొణుకు బెనుకు చూపని వీర, శూర, పరాక్రమం కలిగిన ఈ సురేందరుడిని ఎవరు అని అంటావా."
" ఓహో ఈ గుడికి కొత్త రక్షకుడిగా వచ్చావా. నీ చావు కూడా నా చేతిలోనే" అని యమకాసురుడు విర్రవీగుతూ మాట్లాడాడు.
సురేందరుడు ,యమకాసురుడిని యుద్దానికి ఆహ్వానించాడు. యమకాసురుడు తన కొడ్డలి తీసుకొని యుద్దానికి వెళ్ళాడు. సురేందరుడు తన కత్తిని తీసుకొని యుద్దానికి దిగాడు. ఇద్దరిమధ్య భీకర యుద్ధం జరుగుతుంది. ఎవరి సత్తువ తగ్గిపోవడం లేదు.వెరి యుద్ధం ఇక్కడ సాగుతుంటే మిగిలిన భూమి మీద భీకర వర్షాలు కురుస్తున్నాయి. ఇక తన మరో కత్తి యమపాషన్నిబయటకు తీసి యమకాసురుడి తల నారికివేసాడు. దేవతలు చాలా సంతోషించారు.
భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని సురేందరుడు అక్కడక్కడ కొన్ని ఆయుధాలు దాచి ఉంచాడు.అంటే ఈ గుడి ఒక కొండ మీద ఉంది.అక్కడికి చేరుకోవడానికి మెట్లు ఏర్పాటు చేసుకున్నాడు. ఆ మొదటి మెట్టు దగ్గర ఒక పెద్ద చెట్టు ఉంది. ఆ చెట్టు యొక్క తొర్రలో ఒక గదలంటికి పెట్టాడు.కొన్ని సంవత్సరాల తర్వాత కందకాసురుడు ఉద్భవించాడు. అతనికి ఆ చెట్టుపై ఆశ ఉంది. అతను ఒక రోజు సాధువుల సురేందరుడి దగ్గరకు వచ్చి తీర్ధంలో విషం కలిపి ఇచ్చాడు. అది తెలియని సురేందరుడు దాన్ని తాగి మరణించాడు. ఇక ఆ గుడి తన వశం అయ్యింది. తను తనకు అనుకూలంగా ఉండే ఎద్దుని పుట్టించాడు ఆ ఎద్దు రాక్షస రూపం కూడా ధరించగలదు.
ఈ విధంగా పోయినా జన్మలో నువ్వు సురేందరుడి గా చనిపోయి మళ్ళీ ఇప్పుడు పుట్టావు అని ఆ ముని కార్తీక్ ఇలా కథ చెప్తాడు.
"అసలు ఈ విషయాలు మీకెలా తెలుసు",అని కార్తీక్ అన్నాడు.
దానికి ఆ ముని ఈ విధంగా సమాధానం ఇస్తాడు," 1000 సంవత్సరాల తర్వాత నువ్వు వస్తావని.నికు ఆ కథ అందించాలని మా పూర్వీకులు ఈ కథను అందిస్తూ వచ్చారు"
ఇక ముని తన ఆశ్రమానికి వెళ్తాడు. చీకటి పడింది.తెల్లవారితే శివరాత్రి ప్రజలంతా ఆ జ్యోతి కోసం ఎదురుచూస్తున్నారు. కార్తీక్ గుడిలోపలికి వెళ్దాం అని అడుగు పెట్టీ పైకి వెళ్ళాడు. అంతే కందకాసురుడు సృష్టించిన ఎద్దు తన ముందు వచ్చి నిల్చుంది. ఆ ఎద్దు రాక్షస రూపం ధరించింది. కార్తీక్ పిడికిలి బిగించి గాల్లోకి ఎగిరి ఆ రాక్షసుని తలపై గట్టిగా ఒక్కటి ఇస్తాడు. ఆ రాక్షసుడిని చిమకుట్టినట్లు కూడా అనిపించదు. ఆ రాక్షసుడు కార్తీక్ నీ గాల్లోకి ఎగరేసి కొడతాడు. కార్తీక్ ఎంత ప్రయత్నించినా ఒక దెబ్బ కొట్టలేక పోతున్నాడు. ఆ రాక్షసుడు కార్తీక్ నీ ఆ మెట్ల పై నుంచి విసిరేసాడు. కార్తీక్ స్పృహ తప్పి కింద పడి ఉంటాడు. ఆ రాక్షసుడు వెన్నకి వెళ్తాడు. కార్తీక్ కి కథ చెప్పిన మునికి భీకరముగా శబ్దాలు వినిపిస్తే చూడడానికి వస్తాడు. తీరా వచ్చాక చూస్తే కార్తీక్ అక్కడ పడిపోయి ఉంటాడు. ఆ ముని కార్తీక్ నీ తన ఆశ్రమానికి తీసుకొని వెళ్తాడు. కొన్ని ఔషధాలు ఇచ్చి కార్తీక్ నీ బ్రతికిస్తాడు.
లేచిన కార్తీక్ తో ఆ ముని ఇలా అంటాడు, " ఇప్పుడు నువ్వు కార్తీక్ కాదు మహావీరుడైన సురేందరుడివి. అతను పోరాదు".
కార్తీక్ మళ్ళీ గుడిమెట్ల దగ్గర కి వెళ్తాడు. పైకి ఎక్కుతాడు ఆ ఎద్దు మళ్ళీ రాక్షస రూపం ధరించి వస్తుంది. ఈ సారి కార్తీక్ కళ్ళల్లో ఆ రాక్షసుడిని ధైర్యం కనిపిస్తుంది. కార్తీక్ ఆ ముని చెప్పింది గుర్తుతెచ్చుకొని అక్కడ ఉన్న పెద్ద చెట్టు తొర్ర లోనుంచి ఆయుధం తీసి ముందుకి అడుగు వేస్తాడు. ఆ రాక్షసుడు తన వైపుగా పరిగెత్తుతూ వస్తాడు. కార్తీక్ మళ్ళీ గాల్లోకి ఎగిరి ఆ ఆయుధం తో తల పై గట్టిగ కొడతాడు. ఇలా వారి మధ్య భికర యుద్దం సాగుతుంది. కార్తీక్ చివరకు ఆ రాక్షసున్ని చంపేస్తాడు. సూర్యుడు ఉదయించే సమయం అయ్యింది. ఇంకొక 12 గంటల్లో జ్యోతి ప్రకాశిస్తుంది. సూర్యుడు ఉదయించాడు. అయినా ఆ దారి దట్టంగా ఉండడం వల్ల చీకటిగా ఉంది. కార్తీక్ ఒక వెలుగు కోసం నిప్పు వెలిగించి. పట్టుకున్నాడు పైకి వెళ్ళేసరికి సాయంత్రం 7:30 అయ్యింది ప్రజలంతా జ్యోతి కోసం ఎదురుచూస్తున్నారు. ఇంతలో కార్తీక్ ముందుకి కంధకాసురుడు వస్తాడు. వచ్చీరాగానే కార్తీక్ సురేందరుడుఅని గుర్తించి, కొడతాడు. కార్తీక్ ఆ దెబ్బకు గాల్లో ఎగిరి క్రింద పడి పోతాడు. తన చేతిలో ఉన్న నిప్పు హోమగుండంలో వెళ్ళి పడుతుంది. ప్రజలకి ఆ జ్యోతి కనిపిస్తుంది. అందరూ ఆ మహా జ్యోతిని దర్శించుకుంటారు. శివరాత్రి ఉత్సవాలు మొదలు పెడుతారు. ఆ గుడిలో జ్యోతి వెలగడం వల్ల గుడి మొత్తం కంటితో నిండి పోతుంది.
అయితే కార్తీక్ కి తన పూర్వ జన్మ గుర్తు వస్తుంది. వెంటనే గాల్లోకి చెయ్యి చాపి " భగిరా"అని గట్టిగ అరవగానే తన కత్తి యమపాశం తన చేతిలోకి వస్తుంది. ఇక ఏముంది కార్తీక్ మరియు కందకాసూరుడు యుద్ధం ఆరంభించారు. వారిమధ్య యుద్ధ చాలా భిగరం గా సాగుతుంది. ఎన్ని యుద్దాలు జరిగిన గెలిచేది మంచే కాబట్టి ఈ మహా యుద్ధంలో కూడా కార్తీక్ గెలిచాడు.
ఈ కథ ఇంకా అయిపోలేదు. అసలు మన కథ ఆ చెట్టు గురించి. కాబట్టి కాస్త ఆగండి. కార్తీక్ గుడి తలుపుల దగ్గరకు వెళ్ళాడు. తలుపులను తోసాడు అయిన తెరుచుకోలేదు. అప్పుడే ఆ తలుపుకి ఒక శివలింగం యొక్క ముద్రని చూశాడు. అది అచ్చం తన దగ్గరే ఉన్న శివలింగం లా ఉంది. వెంటనే తన బ్యాగ్ ఉన్న లింగాన్ని తెచ్చి ఆ ముద్రలో పెట్టాడు. పెద్ద కాంతిని ప్రదర్శిస్తూ తలుపులు తెరుచుకున్నాయి. లోపలి కి వెళ్ళడం అని అనుకున్నాడు అప్పుడే తన కన్ను పక్కన ఉన్న నంది మరియు గద్ద యొక్క శిలల మీద పడింది. వాటిని ముట్టుకోగానే వాటికి ప్రాణం వస్తుంది. అవి కార్తీక్ కి ధన్యవాదాలు చెప్పుకున్నాయి. కార్తీక్ లోపలికి వెళ్ళాడు ఆ చెట్టు నీ చూశాడు. ఆ చెట్టుని అంతంచెయ్యదనికి మనసురాక గది తలుపులు మూసేసి లింగాన్ని గుడిలో ప్రతిష్టించాడు. ఇక ఆ తలుపు ఎవ్వరు తెరవలేరు.
కార్తీక్ మళ్ళీ తిరిగి వెళ్ళి హై కమాండ్ కి ఆ చెట్టు గురించి పూర్తిగా వివరిస్తాడు. హై కమాండ్ ఆ మొహ్మద్ గురించి అడుగుతాడు. కార్తీక్ దానికి తెలీదు అని చెప్పాడు.
పాకిస్తాన్ లో మొహ్మద్ బాషా 2 acres కొని అందులో" INDIA IS THE PLACE OF PEACE AND ETHICS" అని పెద్దగా ఒక శిల పెట్టించి పక్కన గాంధీ విగ్రహం కట్టిస్తాడు. వాటికి 100మంది సోల్జర్స్ నీ సెక్యూరిటీ గా నిర్మిస్తాడు.
~~శుభం~~
