స్ట్రయిక్
స్ట్రయిక్
STRIKE
ఇది MASTER SERIES యొక్క మూడోవ భాగం. ఇంకా ఒక భాగం మిగిలి ఉన్నది. దీని మొదటి భాగం THE ZOMBIES అనే పేరు తో ఉంది. అందులో జొంబీస్ నీ అంతం చేయడానికి వెళ్తాడు. రెండోవ భాగంలో మన సార్ ఒక మిస్టీరియస్ బాక్స్ నీ చేదించడానికి వెళ్తాడు. ఈ కథలో స్టూడెంట్స్ ఫేస్ చేస్తున్న ప్రాబ్లెమ్ కి సార్ అండగా నిలబడితే ఎలా ఉంటుందో ఒక చిన్న కథ రూపంలో నిర్మించాను.
వెంకట్ సార్ COIMBATORE నుంచి ఖమ్మం వచ్చాడు. ఒక 2డేస్ రెస్ట్ తీసుకొని మరునాడు కాలేజ్ కి కార్ లో వెళ్తున్నాడు. అలా వెళ్తుండగా అప్పుడే గవర్నమెంట్ NEET exam షెడ్యూల్ నీ రిలీజ్ చేస్తుంది. వెంకట్ సార్ కాలేజ్ కి వెళ్లకుండా యూటర్న్ తిప్పుకొని తన సొంత institute అయిన TELANGANA MEDICAL ACADEMY కి వెళ్తాడు. Neet exam రాయబోయే స్టూడెంట్స్ దగ్గరికి వెళ్ళి ముందుగా NEET EXAM డేట్ గురించి చెప్తాడు. అయితే వాళ్ళలో కొంత మంది స్టూడెంట్స్ కాస్త టెన్షన్ గా ఫీల్ అవుతారు మరికొందరిలో భయం మొదలవుతుంది. ఇది గమనించిన వెంకట్ సార్," స్టూడెంట్స్ NEET EXAM డేట్ వచ్చింది కదా అని ఎవ్వరూ భయపడవలసిన అవసరం లేదు. ఈ neet exam మీకు ఈజీగానే ఉంటుంది. ఎందుకంటే మీరు చాలా అంటే చాలా కాన్సంట్రేషన్ తో ఏ ఇబ్బంది లేకుండా భాగ ప్రిపేర్ అయ్యారు. దీంతో పాటుగా మీ exam కి ఇంకా 2months టైం ఉంది. మీ exam జరిగిందాక నేను మీతోనే ఉంటా. వీక్లీ టెస్ట్ కూడా పెడతా దాని వల్ల NEET EXAM పై ఒక గ్రిప్ వస్తుంది."అని అంటారు. అలా 2months వెంకట్ సార్ neet coaching హై లెవెల్ లో ఇచ్చాడు. Neet exam లో స్టూడెంట్స్ అంత భాగానే రాశారు. అందరికీ సీట్స్ వస్తాయి అని అనుకున్నారు. కొన్ని రోజులకు NEET రిజల్ట్ వచ్చింది. రిజర్వేషన్ ఉన్న SC మరియు ST పిల్లలకు తక్కువ మార్కులు వచ్చిన మంచి ఇన్స్టిట్యూట్ లో సీట్స్ వచ్చాయి. అలా వెంకట్ సార్ COLLEGE లో ఇద్దరికీ వచ్చాయి. కానీ వీళ్ళ కన్న ఎక్కువ మార్కులు వచ్చిన OC పిల్లలకు మాత్రం సీట్ రాలేదు. ఎందుకంటే వాళ్ళకు రిజర్వేషన్ లేదు. దీనికి ఇంకా తను డాక్టర్ కాలేదు అనే బాధ తో నేహా అనే అమ్మాయి ఏడుస్తుంది. తనది పూర్ background family.రెండు రోజుల తర్వాత josephson medical University వాళ్ళు వచ్చి తన మార్కులను ముందుగా మెచ్చుకున్నారు. కొంతసేపు ఆ కాలేజ్ గురించి మాట్లాడి చివరకు ఫీస్ విషయానికి వచ్చారు. "సార్ మీరు చెప్పింది మొత్తం భాగానే ఉంది. ఇంతకు ఫీస్ ఎంత?"అని నేహా అంటుంది. "ఏం లేదమ్మా టోటల్ ఫీస్ వచ్చి 2కోట్లు నీ మార్క్స్ కి మేము ఇచ్చే డిస్కౌంట్ 1క్రోర్87లక్స్."అని అంటారు.
"సార్ దీని గురించి నేను తర్వాత మాట్లాడుతాను"అని అంటుంది నేహా.
"తర్వాత దేనికి రేపు ఒకసారి కాలేజ్ కి రాండి అన్ని అక్కడే మాట్లాడుకుందాం"అని అంటాడు.
ఈ విషయం గురించి మొత్తం నేహా వెంకట్ సార్ కి చెబుతుంది.నెక్స్ట్ డే నేహా వెంకట్ సార్ తో కలిసి కాలేజ్ కి వెళ్ళి అక్కడి హెడ్ తో మాట్లాడుతారు. "యా సార్ నాపేరు జోసెఫ్. నేను ఈ యూనివర్సిటీ నీ 10years గా నడుపుతున్నాను. మెడికల్ సీట్ మా దగ్గర వచ్చిన లేకపోతే ఢిల్లీ AIMS లో వచ్చిన ఒకటే కాకపోతే అది ఫ్రీ మాది ఫీస్ తో కూడినది"అని జోసెఫ్ అన్నాడు.
"హా తెలుసు సార్. అందుకే ఈ అమ్మాయిని ఇక్కడ జాయిన్ చేద్దామని ఒచ్చా"అని వెంకట్ సార్ అన్నాడు.
"అయితే ఇంకా మంచిది. ఫామ్ ఫీల్ చేసి అడ్మిషన్ ఫీస్ 19లక్స్ కట్టండి"అని జోసెఫ్ అంటాడు.
"అది కాదు సార్. నేహా ఒక మెరిట్ స్టూడెంట్,పూర్ background కానీ డాక్టర్ కావాలనేది నేహా ఆశయం. ఫీస్ గురించి కాస్త ఆలోచించండి"అని వెంకట్ సార్ అన్నాడు.
"హ్మ్!తిండికి గతిలేని వాళ్ళు పెద్దపెద్ద కోరికలు పెట్టుకోవాలి. తనలాంటి వాళ్ళు ఇంటి ఇంటికి వెళ్ళి పాచి పనులు చేసుకోవడం నయం. కనీసం ఇంటి ఖర్చులకైన వస్తాయి"అని పొగరుగా జోసెఫ్ సమాధానం ఇచ్చాడు. నేహా ఏడుస్తూ బయటకు వెళ్ళింది. వెంకట్ సార్ కి కోపం వచ్చి జోసెఫ్ చెంప పగల కొడతాడు. "నన్నే గొడతావ?"అని చెప్పి జోసెఫ్ బయట ఉన్న తన మనుషులను పిలుస్తాడు. వెంకట్ సార్ చిన్న సౌండ్ కూడా రూమ్ దాటి వెళ్లకుండా వాళ్లందరినీ కొడతాడు. వెళ్తూ వెళ్తూ " రేయ్ సిగ్గు లేని కుక్క. తూ! బిచ్చగాడు కూడా నీ కన్న నిజాయితీగా ఉంటాడు. నువ్వూ చదువుని వ్యాపారం గా మార్చుకొని డబ్బులు సంపాదిస్తున్నావ్"అని వెంకట్ సార్ జోసెఫ్ కి కోపంగా చెప్పి కుర్చీని తన్ని అక్కడినుంచి వెళ్ళిపోతాడు. జోసెఫ్ కోపంతో నేహకు ఎక్కడ మెడికల్ సీట్ రాకుండా చేస్తాడు. ఇది తెలియని వెంకట్ సార్ సంవత్సరం పాటు అన్ని మెడికల్ కాలేజ్ల చుట్టూ తిరుగుతాడు. "నేహా ఇక ఇది కలిసేలా లేదు. నువ్వు డిగ్రీ కి ట్రై చెయ్యి. ఎన్ని రోజులు ఇలా ఉంటావ్" వెంకట్ సార్ అన్నాడు.
నెక్స్ట్ డే నేహా డాక్టర్ కాలేను అనే బాధతో సూసైడ్ చేసుకొని చనిపోయింది. వెంటనే వెంకట్ సార్ అక్కడికి వచ్చాడు. జరిగిన విషయం అక్కడ చూసి లోలోపల కుమిలిపోయాడు.ఈ విధంగా దేశ వ్యాప్తంగా ఎంతో మంది OC మరియు రిజర్వేషన్ లేని స్టూడెంట్స్ మెడికల్ సీట్స్ కోసం కొంతులు కోసుకున్నారు. ఈ రిజర్వేషన్ కి ఏదో ఒక మార్గం చూడాలని గవర్నమెంట్ మీద కేస్ వేశాడు. ఏప్రిల్ 24 తన కేస్ కోర్టు కి వెళ్ళింది. కోర్టు చివరకు సాక్షాలు తీసుకొని రమని చెప్పి రెండు నెలల గడువు ఇచ్చింది. "THANK YOU యువర్ హోనర్. ఈ మే 4TH నుంచి జూన్ 4TH వరకు స్ట్రైక్ ప్రకటిస్తున్న. స్వయాన నా COACHING CENTRE ముందు స్టార్ట్ చేసి అదే సెంటర్ ముందు ఆపుతాను. అక్కడే ముగిస్తా. ఈ మధ్యలో ఎప్పుడైనా నా స్ట్రైక్ ఆగితే నేను తక్షణమే ఈ కేస్ రిటర్న్ తీసుకుంటా అని అన్నాడు."అని వెంకట్ సార్ చెప్పి కోర్టు నుంచి బయటకు వస్తాడు. మే 3RD దాకా ఎన్నో కాలేజీలు తిరిగి MPC,BIPC,CEC… అన్ని రంగాల విద్యార్థులను మోటివేట్ చేసి స్ట్రైక్ కి పిలిచాడు. ఎందుకంటే ఇది ఒక మెడికల్ స్టూడెంట్స్ ది మాత్రమే కాదు. IIT,NIT ఇంకెన్నో వాటిల్లో మెరిట్ స్టూడెంట్స్ ఫేస్ చేస్తున్న ప్రాబ్లెమ్ ఇది. మే 4TH వచ్చింది. వెంకట్ సార్" TODAY STUDENTS ARE TOMORROW SUPERIORS" అనే కొటేషన్ తో తన స్ట్రైక్ కి అందరూ కలిసి మొదటి అడుగు వేశారు.
అలా ఒక్క రోజు గడవక ముందే వందల్లో స్టూడెంట్స్ స్ట్రైక్ లో జాయిన్ అయ్యారు. మీడియా వాళ్ళు కూడా వచ్చారు. వెంకట్ సార్ దగ్గరకి ఒక జర్నలిస్ట్ వచ్చి," సార్ మీ ఈ స్ట్రైక్ వెనుక ఉన్న కారణం ఏంటో తెలుసుకోవొచ్చ?"అని అడిగాడు.
వెంకట్ సార్ అప్పుడు ఇలా అన్నాడు,"రిజర్వేషన్ . మంచి స్కోర్ వచ్చిన ఫ్రీ సీట్స్ ఇవ్వాల్సిన వాళ్ళు చేతులు ఎత్తేసి కూర్చున్నారు. దీన్ని అదునుగా తీసుకొని ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ వాళ్ళు సొమ్ము చేసుకుంటున్నారు. వారి జీవితాలతో ఆడుకుంటున్నారు".
మళ్ళీ స్ట్రైక్ నీ మొదలు పెట్టారు. రిజర్వేషన్ లేని స్టూడెంట్స్ నీ ఆధారం చేసుకొని బతికే josephson medical University లాంటి వాళ్ళు సమావేశం అయ్యారు. "జోసెఫ్ గారు ఆ వెంకట్ చూస్తుంటే మన బ్రతుకులు రోడ్డుకి ఈడ్చెల ఉన్నాడు. వాన్ని ఏదోకటి చెయ్యాలి"అని technology college చైర్మన్ అంటాడు. జోసెఫ్ అన్ని మౌనంగా వింటున్నాడు. ఇంతలో WAY TO TECH అనే కాలేజ్ హెడ్," నాకు తెలిసిన ఒక ధీరుడు శూరుడు ఉన్నాడు. అతను ఒక ఆర్మీ . తను చేసిన ఒక పని వాళ్ళ ఇప్పుడు తను దాక్కొని దాక్కొని తిరుగుతున్నాడు. వెంకట్ నీ ఎదిరించే మొనగాడు మగాడు వీడే. కానీ వాడిని కొనడం అంత easy కాదు " అని అన్నాడు. జోసెఫ్ కొద్ది సేపు అలోచించి," వాడి అడ్రెస్స్ ఇవ్వు రేపు సరిగ్గా ఈ టైం కళ్ళ నేను తీసుకొని వస్తా"అని ఛాలెంజ్ చేశాడు. ఆ ఆర్మీ పర్సన్ ఎవరంటే SATISH. mysterious box కనుకునే క్రమంలో సాయపడిన వ్యక్తి(#పార్ట్2 THE HIDDEN MYSTERY). జోసెఫ్ ఒక రైఫిల్ గున్ తీసుకొని అందులో హిపనోటైజ్ డ్రగ్ నీ లోడ్ చేసి సతీష్ నీ ఫైర్ చేశాడు. ఇక సతీష్ కి ఏం వినపడదు. జోసెఫ్ చెప్పిన మాటలు తప్ప. సతీష్ ఏం చెయ్యాలో జోసెఫ్ మొత్తం వివరించాడు. సతీష్ నీ జోసెఫ్ ఒక కీడు బొమ్మల వాడుకుంటున్నాడు. స్ట్రైక్ కొనసాగుతూనే ఉంది. ఇంతలో బుల్లెట్ ఫైర్ సౌండ్ వినిపించింది. అందరూ ఒక్క నిమిషం సైలెంట్ అయ్యారు. వెంకట్ సార్ లేచి నిల్చొని వెన్నకి చూసాడు. ఒక జీప్ మీద సతీష్ తన స్నైపర్ గన్ పట్టుకొని ఉన్నాడు. వెంకట్ సార్ సతీష్ దగ్గరకు వెళ్ళి తన భుజం మీద చెయ్యి వేసి," నువ్వేంటి ఇక్కడ ఉన్నావ్?"అని అడిగాడు. (జోసెఫ్ తనకి ఆ డ్రగ్ ఇచ్చినప్పుడు ఏం చెప్పాడంటే "నువ్వు ఆ వెంకట్ చేస్తున్న స్ట్రైక్ నీ ఆపిపెయ్యలి") వెంటనే సతీష్ , తన భుజం మీద వేసిన వెంకట్ సార్ చెయ్యిని పట్టుకొని బలంగా విసిరేసాడు. "సతీష్ నీకు ఏం అయ్యింది? ఎందుకు ఇలా చేస్తున్నావ్?" అని వెంకట్ సార్ అడిగాడు. సతీష్ అది ఏదీ పట్టించుకోలేదు. వెంకట్ సార్ తీవ్రంగా గాయపరిచాడు. గుండెలమీద కాలితో తన్ని తన sniper గన్ తో కాల్చాడు. స్ట్రైక్ లో ఉన్న స్టూడెంట్స్ అంతా వెంకట్ సార్ నీ తీసుకొని హాస్పిటల్ కి వెళ్ళారు. కొద్ది క్షణాల్లోనే ఆ చోటు కాలి అయ్యింది. అందరూ వెళ్లిన ఒక్కడు మాత్రం 'NEVER GIVE UP' అనే బోర్డు పట్టుకొని అక్కడే కూర్చున్నాడు.సతీష్ మనుషులు అతన్ని గమనించి అతని దగ్గరికి వెళ్ళారు. అతని భుజం మీద చెయ్యి వేసి లేపడానికి ప్రయత్నించాడు. సతీష్ లనే భుజం మీద వేసిన చెయ్యిని పట్టుకొని రోడ్ కి వేసి కొట్టాడు. సతీష్ కొట్టిన దెబ్బకన్న ఎక్కువగా అతను కొట్టాడు. వెంటనే అతను లేచాడు. "రేయ్! ఎవడ్ర నువ్వు?" అని సతీష్ అన్నాడు.
"కార్తీక్. మేజర్ కార్తీక్. బ్యాచ్ నంబర్ 2016, ట్రైనింగ్ తీసుకుంది U.Pలో పనిచేస్తుంది అండర్ కవర్ గా"అని అతను అన్నాడు.
"అండర్ కవర్ అని చెప్పి ఊరు మొత్తం తిరుగుతున్నావు. సిగ్గు లేదా?" అని సతీష్ హాస్యంగా అడిగాడు.
" చేసేది కరెక్ట్ పని. కరప్ట్ నా కొడుకుల దగ్గర ఇలా చెప్పుకోవడం లో తప్పులేదు"అని కార్తీక్ అన్నాడు.
"ఒంటినిండా పోగరే ఉంది" అని సతీష్ కోపం గా అన్నాడు.
"ఇది పొగరు సినిమా చూస్తే వచ్చిన పొగరు కాదు, పుట్టుక నుంచి నా బ్లడ్ లో ఉన్న పవర్. టచ్ చేస్తే మాడి మసై పోతావ్" అని కార్తీక్ చెప్పాడు.
"రేయ్ వాడిని ముక్కలు ముక్కలుగా నారికెయ్యంది"అని సతీష్ అన్నాడు.
సతీష్ మనుషులు కార్తీక్ పైకి వెళ్ళాడు. కార్తీక్ ఉన్న చోటు నుంచి కదలకుండా అందరినీ కొట్టాడు. సతీష్ కోపంతో చొక్కా చింపుకొని వెళ్ళాడు. ఎద్దరు తీవ్రంగా కొట్టుకుంటున్నారు. కానీ చివరికి సతీష్ నీ కార్తీక్ కొట్టిన దెబ్బకు వెళ్ళి జీప్ కి అతుకున్నాడు. అతని మనుషులు అతన్ని తీసుకొని వెళ్ళారు. వారం పాటు వెంకట్ సార్ హాస్పిటల్ లోనే ఉన్నాడు. మేజర్ కార్తీక్ ఆ స్ట్రైక్ నీ ఒంటరిగానే సాగిస్తున్నాడు. వారం తర్వాత వెంకట్ సార్ వచ్చాడు. మేజర్ కార్తీక్ కి ధన్యవాదాలు చెప్పాడు. అతను అక్కడి నుంచి వెళ్ళి పోయాడు.సతీష్ స్పృహ కోల్పోయాడు. వెంకట్ సార్ సతీష్ విషయంలో ఎం జరిగిందో తెలుసుకున్నాడు. సతీష్ నీ ఎం చెయ్యాలని ఒక ఐడియాకు వచ్చాడు. సతీష్ స్పృహలోకి వచ్చే లోపు వెంకట్ సార్ కొన్ని సాక్షాలు సంపాదించాడు. 3 వారాల తర్వాత సతీష్ స్పృహలోకి వచ్చాడు. జోసెఫ్ మళ్ళీ వెంకట్ సార్ పై ఉసి కలిపాడు. వెంకట్ సార్ సతీష్ ముందుకి వెళ్ళాడు. సతీష్ డాక్యుమెంట్స్ అడిగాడు. వెంకట్ సార్ కొంచెం ముందుకి వెళ్ళి "సతీష్…..!"అని గట్టిగ అరిచాడు. సతీష్ మామూలు మనిషి అయ్యాడు. సతీష్ అటు ఇటు బిత్తిరి చూపులు చూస్తున్నడు. వెంకట్ సార్ జరిగింది మొత్తం చెప్పాడు. జోసెఫ్ కి మొత్తం తెలిసింది. వెంకట్ సార్, సతీష్ కలిసి స్ట్రైక్ కొనసాగించారు. కోర్టు కి ప్రూఫ్ చుయించ వలసిన సమయం వచ్చింది. తెల్లవారితే కోర్టు కి వెళ్ళాలి. ఆ రోజు రాత్రి అందరూ పడుకున్నారు. సతీష్ మాత్రం లేచే ఉన్నాడు. జోసెఫ్ వెళ్ళి సతీష్ గురించి ఇన్ఫర్మేషన్ డైరెక్ట్ గా గవర్నమెంట్ కి ఇచ్చాడు. వాళ్ళు కూడా సతీష్ నీ వెతుకుతున్నారు కనక ఆర్మీ నీ పంపించారు. రాత్రి ఆర్మీ దిగింది. సతీష్ గమనించాడు. వీలైనంత మందిని సతీష్ కొట్టాడు. అయినా వాళ్ళు సతీష్ నీ అరెస్ట్ చేశారు. కోర్టు కి ప్రూఫ్ చుయించే సమయం వచ్చింది. వెంకట్ సార్ సతీష్ కోసం వెయిట్ చేశాడు. సతీష్ ఎంతసేపటికీ రాకపోవడం తో కోర్టు కి వెళ్ళాడు. జడ్జ్ వచ్చాడు. వెంకట్ సార్ నీ ప్రూఫ్లు అడిగాడు. కొన్ని డాక్యుమెంట్స్ ముందల పెట్టీ," సార్ తను స్వాతి NEET లో HIGHEST ర్యాంక్ సాధించి ఢిల్లీ ఎమ్స్ లో సీట్ సంపాదించిన OC అమ్మాయి తను. కానీ మన JOSEPHSON UNIVERILSITY వాళ్ళు దాన్ని తట్టుకోలేక నడి రోడ్ మీద సమోసి కుప్పతొట్లో విసిరేసాడు. దానికి సరిపోయే సీసీటీవీ ఫోటేజ్. నెక్స్ట్ ఫీల్ లో ఉంది అనురాగ్ JOSEPHSON UNIVERISTY లో పనిచేస్తూ డాక్టర్ ట్రైనింగ్ ఇస్తూ 56 మందిని చంపేశాడు. దానికి ప్రూఫ్ నెక్స్ట్ పేజీ లో. ఇంకా చాలా ఉన్నాయి అవి మీరే పరిశీలించాలి"అని చెప్పాడు.
కోర్టు గంట సేపు గమనించి ," మెడికల్ అనే పేరుకి మచ్చ తునకల నిలిచిన వీరిని నష్ట పోయిన కుటుంబాలకు నష్టపరిహారం గా 50లక్షల మూల్యం చెల్లించి వారి యూనివర్సిటీ లను సీజ్ చెయ్యాలని కోర్టు ఆదేశం" అని చెప్పాడు. వారి అందరి యూనివర్సిటీస్ సీజ్ చేసింది.
" OC,BC,ST,SC.. అందరికీ సమాన రిజర్వేషన్ ఇవ్వాలంటే కలిసే పని కాదు. నేను ఈ కోర్టు లో ఉంది కనిస్తూషన్ కి ఎదురు వెళ్ళ రాదు. ఏం చేద్దాం నీవే చెప్పి"అని జడ్జ్ అడిగాడు.
వెంకట్ సార్," పర్మిషన్.. ఫ్రీ గా మెడికల్ అండ్ ఇంజనీరింగ్ కాలేజ్ ఓపెన్ చేస్తా దానికి గవర్నమెంట్ తరుపున మీరు పర్మిషన్ ఇవ్వండి" అని వెంకట్ సార్ అడిగాడు.
జడ్జ్ కొద్దిసేపు అలోచించి పర్మిషన్ ఇచ్చింది. 3 సంవత్సరాల్లో కాలేజ్ కట్టాడు. అందరికీ సమానంగా గా ఫ్రీ సీట్స్ వారి స్కోరింగ్ బట్టి ఇచ్చాడు. ఈ విధంగా గా మెరిట్ స్టూడెంట్స్ వారి ఆశయాలను చేరుకున్నారు.
