STORYMIRROR

Vemuluri Satish

Drama Fantasy

4  

Vemuluri Satish

Drama Fantasy

శ్రీ రామ పుత్రుల గాథ

శ్రీ రామ పుత్రుల గాథ

6 mins
364

సంపూర్ణ రామాయణం లో భాగాలను కాండలుగా మనకి వాల్మీకి చూయించాడు. నేను ఈ శ్రీ రామ పుత్రుల గాథ లో భాగాలను కాలలుగా చుయించాను. ప్రస్తుతానికి అవి 2 మాత్రమే ఉన్నాయి. మీ ప్రోత్సహాన్ని బట్టి వీలైతే ఇంకొన్ని భాగాలు రాస్తాను. వీటితో పాటుగా మీకు తెలియని కొన్ని రామాయణ నిజాలు చివరకు చుయిసస్తాను


బాల్య కాలం


రామ రావణ యుద్ధం అనంతరం సీతారామలక్ష్మణులు పుష్పక విమానంలో అయోధ్యనగరనికి చేరుకున్నారు. భారత శతృఘ్న మరియు ఇతర సామంతులు సీతారాములకు గణ స్వాగతం పలికారు. రాముడు అయోధ్యకు రాజుగా పట్టాభిషేకం పొందాడు.కానీ ఒక చాకలి వాడు సీతాదేవి కొన్ని సంవత్సరాల పాటు రావణ రాజ్యంలో ఉన్న విషయం గురించి నింద వేస్తాడు. అలా రాముడికి ఇష్టం లేకపోయినా సీతని వనవాసానికి పంపించాడు. తర్వాత లవకుశులకి జన్మనిస్తుంది. లవకుశులు రాముడిని చేరుకుంటారు. తర్వాత సీతాదేవి భూమిలోకి వెళ్తుంది. బ్రతుకైన, చావైన సితకొసమే అనుకొని రాముడు సరయు నదిలో కలిసి పోతాడు. అన్నపై అపర అభిమానం ఉన్న భారత, శతృఘ్న,లక్ష్మణులు రాముడితో పాటుగా సరయు నదిలో కలిసి పోతారు.


 లవకుశులు అయోధ్యను వదిలి వెళ్ళడం.


దశరథ మహారాజు తర్వాత రాముడు అయోధ్యకు రాజయ్యాడు. రాముడి వారసుడిగా కుశుడిని రాజు అవ్వమని రాజ్య ప్రధమ పురోహితుడు వశిష్టుడు చెప్పాడు .కానీ వారు రాజ్యానికి ఒక రాజుల అస్సలు సరిపోమని, కొంత కాలం పాటు విద్య అభ్యాసం చేసి ఆ తర్వాత తిరిగి వచ్చి రాజ్యాన్ని పాలిస్తనని చెప్పి , తిరిగి మళ్ళీ తమసా నది తీరాన ఉన్న వాల్మీకి ఆశ్రమానికి వెళ్తారు. ఒక రాజుకి కావాల్సిన శిక్షణను అందించమని లవకుశులు కోరుతారు. వాల్మీకి దానికి అంగీకరించాడు. ముందుగా ఒక రాజు నడవడిక ఎలా ఉండాలని వాళ్ళ తండ్రి రాముడిని ఉద్దేశించి చెప్తాడు.వాల్మీకి మహర్షి చెబుతున్న విషయాలు మొత్తం లవకుశులు కళ్ళముందల తిరుగుతున్నాయి. ఇలా పూర్తిగా రాజు యొక్క నడవడికను తెలుసుకున్నారు. మరుసటి రోజు ఉదయం లవకుశులు , వాల్మీకి మహర్షి తన శిష్యులతో కలిసి తమసా నది తీరానికి వెళ్ళి సూర్యనమస్కారం చేసుకొని సూర్యునికి పూజ చేసి వాళ్ళ రోజుని ప్రారంభిస్తారు. 


ఆ రోజు వారికి అన్నిరకాల కత్తి మరియు విలు విద్య నేర్పిస్తాడు వాల్మీకి. వాల్మీకి శిష్యుల్లో ఒకల్ని పిలిచి లవుడితో కత్తి సాము చెయ్యమని చెప్తాడు. కానీ దీనిలో వాల్మీకి పెట్టిన నియమo ఏమిటంటే కుశుడు కళ్ళకి గంతలు కట్టుకొని యుద్ధం చెయ్యాలి, ఇచ్చిన ప్రదేశం నుంచి తప్ప వేరే చోటుకి ఒక్క అడుగు కూడా వెయ్యరాదు.చెప్పిన విధంగానే కుశుడు కళ్ళకి గంతలు కట్టుకొని భరిలోకి దిగాడు. యుద్ద జోరుగా సాగుతున్నాయి. ఎవరికి వారే సాటి అన్నట్లుగా ఉంది. వాల్మీకి మహర్షి ఇచ్చిన శిక్షణను సరిగ్గా పాటిస్తూ ఎదురు దెబ్బలనుంచి తప్పించుకొని కత్తి తీసుకొని వెళ్ళి సరిగ్గా తనతో పోటీకి దిగిన వాడి మెడపై కత్తి పెట్టాడు.వాల్మీకి , లవుడు ప్రదర్శించిన సామర్ధ్యాన్ని మెచ్చుకున్నడు. ఇప్పుడు కుశుడిని ముందుకి ధనస్సు మరియు ఒక బాణం చేతిలో పెట్టి,వాల్మీకి ఇలా అన్నాడు"ఇది మీ నాన్నగారు వాడిన ధనస్సు. మీ నాన్న గారు ఒక్క బాణం తో 7చెట్లు విరిచినట్లు. నువ్వు కూడా ఒక సారి ప్రత్నించు". కుశుడు బాణం ఎక్కు పెట్టి తన తండ్రిని మనసులో స్మరించుకొని బాణం వదిలాడు. కానీ అది 2 చెట్లను మాత్రమే విరిచింది. లవకుశులు వేరువేరు విద్యల్లో భాగ ఆరితేరారు.లవుడు కత్తి విద్యతో పాటు ధనస్సు విద్య కూడా నేర్చుకున్నాడు. కుశుడు కత్తి విద్య కూడా నేర్చుకున్నాడు. వాల్మీకి ఫలితాలు చెప్పాడు. లవుడి సామర్ధ్యానికి యమపషం అనే ఒక కత్తిని ఇచ్చాడు. కుశుడికి ఒక కండ్రుకొడ్డలి ఇచ్చాడు. వాల్మీకి కుసుడిని పక్కకు తీసుకొని వెళ్ళి ఒక్కసారే 100 బాణాలు ఒక్క ధనస్సు పై ఎక్కుపెట్టి వదిలే మంత్రం చెప్తాడు. కానీ అది ఒక్క విల్లుపై ఒక్క సారి మత్రమె ప్రయోగించలి. వాల్మీకి మళ్ళీ లవుడిని పక్కకు తీసుకొని వెళ్ళి ఒక మంత్రం జపించి గాల్లోంచి ఒక శక్తివంతమైన విల్లుని లావుడి చేతిలో పెడతాడు. దాని ప్రత్యేకత ఏమిటంటే విల్లునరి లాగి ఎక్కు పెడితే శక్తి వంతమైన బాణం ఏర్పడుతుంది. ఇక లవకుశులు యుద్ద శిక్షణ అయిపోయింది.ఇక రాజ్యనీతులు నేర్చుకోవాలి.ఒకనాడు కుశుడు తన విలువిద్య నీ పరీక్షించడానికి తమసా నది తీరానికి వెళ్ళాడు. ఆలోచిస్తూ ఆలోచిస్తూ తన దృష్టి ఒక చేపల గుపు పై పడింది. వాటిలో ఒక చేప కొంచెం ప్రత్యేకంగా ఉంది ఎందుకంటే అది ఆ గుంపుకి నాయకత్వం వహిస్తుంది. కుశుడు తన విద్యను తెలుసుకోవడానికి ఆ చేపని ఎంచుకుంటాడు. వెంటనే విల్లు తీసి ఆ చేపల నాయకుడికి ఎక్కు పెట్టాడు. అతని దృష్టి మొత్తం దానిపైనే పెట్టాడు. బాణం వదిలాడు. ఆ బాణం సరిగ్గా వెళ్ళి ఆ చేపకి గుచ్చుకుంది. ఆ చేప బాధతో చనిపోతూ చనిపోతూ" ఓయీ మానవ! నీవు రాజా పదవికోసం కష్టపడ్డావు.నీ పదవి నీకు వస్తుంది.కానీ గొప్ప రాజు అనే పేరు నీ వంశంలో అందరికీ వస్తుంది నీకు తప్ప"అని చెప్పి ఆ చేప శేపించి చనిపోతుంది. కానీ కుశుడికి ఆ మాటలు ఏమి వినపడవు. కుశుడు తిరిగి మళ్ళీ ఆశ్రమానికి వెళ్తాడు. లవకుశులు వాల్మీకి ఒక చెట్టు కింద కూర్చోపెట్టి రాజా నీతులు మరియు యుద్ద తంత్రాలు నేర్పిస్తాడు. ఇంతలో వాల్మీకి శిష్యుల్లో ఒకలు వచ్చి ఊరి మీదకు వచ్చీ హింసిస్తున్న తారకాసురుడు అనే రాక్షసుడి గురించి చెబుతాడు. యుద్ద విద్యలు లవకుశులు ఎంత పట్టు తెచ్చుకున్నారు తెలుసుకోవడానికి వాల్మీకి ఇది ఒక మంచి పరీక్షగా అనిపించింది. వాల్మీకి ఆ రాక్షసుడిని చంపివేయమని లవకుశులకు ఆజ్ఞాపిస్తాడు. లవకుశులు వారి ఆయుధలైన కత్తి మరియు విల్లు తీసుకొని వెళ్తారు. అప్పటికే తారకాసురుడు ప్రజలను బాగా హింసపెట్టాడు. కుశుడు తారకాసురుడు బాణం వేసి అతని దృష్టి ప్రజలనుంచి ఇతని వైపుకి మల్చుకున్నడు. తారకాసురుడుకోపంతో మంటలు కక్కుకుంటూ లవకుశుల వైపు వస్తున్నాడు.కుశుడు బాణాలు వేస్తూనే ఉన్నాడు. కానీ ఎన్ని బాణాలు వేసిన అతనకి గుచ్చుకొని వెంటనే మయం అయిపోతున్నాయి తప్ప అతనికి ఎం హాని జరగడం లేదు. ఇక తన గుండెలు చిల్చడమే మిగిలి ఉన్న మార్గం అని అనుకొని లవుడికి చెప్పాడు. లవుడు కాస్త దూరం నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి కుశుడి భుజం పై కాలు మోపి గాల్లోకి ఎగిరి, తన దగ్గర ఉన్న కత్తితో అతని గుండెలు చిల్చాడు.తారకాసురుడు అంతటితో అంతం అయ్యాడు. వాల్మీకి మహర్షి వారి సాహసాన్ని మెచ్చుకున్నాడు. ఇక లవకుశులు తిరిగి రాజ్యానికి వెళ్ళమని చెప్పాడు. కుశుడు గురుదక్షిణ గా ఎం ఇవ్వమంటారు అని అడిగాడు. వాల్మీకి "మీరు ఇవల్సిన సమయం లోనే నేను అడుగుతాను. మీరు వెళ్ళండి" అని చెప్పాడు. సుమంతుడు రథం తీసుకొని లవకుశులు దగ్గరికి వచ్చాడు. ఇద్దరు రథం ఎక్కారు. లవకుశులకి అయోధ్య గణ స్వాగతం పలికింది. మంచి తిథిని చూసి పెద్దవాడైన కుశుడికి రాజ పట్టాభిషేకం చేశారు.



రాజ్య కాలం


కుశుడు అయోధ్యకు రాజయ్యాడు. లవుడికి కుశుడు అతనికి కానుకగా లవపురిని(ప్రస్తుతం లాహోర్)స్థాపించి ఇచ్చాడు. వాల్మీకి మహర్షి అయోధ్యకు వస్తున్నట్లుగా కుశుడికి "మంతక" అనే రాబందు ద్వారా వర్తమాన్ని పంపిస్తాడు. మంతకం ఆ వర్తమన్ని చూసి సంతోషిస్తాడు. తన గురువుకి స్వాగతం పలకడానకి స్వయంగా అతనే కోసలదేశం సరిహద్దుకు వెళ్ళి వాల్మీకి నీ స్వాగతిస్తాడు. 15గుర్రాలతో కూడిన రథాన్ని తీసుకొని వెళ్తాడు. ఆ రథంలో వాల్మీకి మహర్షిని ఎక్కించుకొని గణంగా మేళతాళాలతో అయోధ్యకు వెళ్తాడు. వాల్మీకి రథం దిగిన పిమ్మట పూలవర్షం కురుస్తుంది. వాల్మీకి వచ్చే దారి మొత్తం పూలతో పరిచారు. వాల్మీకి అయోధ్యలో అడుగు పెట్టగానే ఎన్నో రకాల పూల సుగంధాలు అతన్ని తాకినవి. అయోధ్య రాజ్యం మొత్తం రకరకాల పూలతో నిండి పోయి ఉన్నాయి. ఎందుకంటే కుశుడికి మొక్కలంటే చాలా ఇష్టం. అందుకే అతని రాజ్యం లో ఎన్నో మొక్కలు నాటాడు. వాల్మీకి మహర్షి లోపలికి వెళ్ళాడు. వెళ్ళిన వెంటనే అతనికి ముందుగా బంగారముతో చేసిన శ్రీ సీతారాముల యొక్క విగ్రహం కనిపిస్తుంది. అది కుశుడు వారి తల్లిదండ్రుల జ్ఞాపకంగా ఎంతో కర్చుపెట్టి చేయించాడు. దాని పక్కనే రాముడు వాడిన "శారంగ" అనే ధనస్సు కనిపిస్తుంది. వాల్మీకి మహర్షి రాముడిని నమస్కరించాడు. కుశుడు వాల్మీకి మహర్షికి అతని మందిరంలో పీఠం వేసి తనచేతుల మెదుగా చేసిన ప్రసాదాలను అతనికి వడ్డిస్తాడు. వాల్మీకి అన్నదాతకు నమస్కరించి, ప్రసాదాలు స్వీకరిస్తాడు. ఆ తరువాత కుశుడు వాల్మీకి మహర్షికి సేవ చేస్తూ అతనితో మాట్లాడుతున్నాడు.


"శిష్య కుశ. నా దగ్గర దగ్గర శిక్ష తీసుకున్న తర్వాత గురుదక్షిణగా నేను అడిగింది ఇస్తానని చెప్పావు గుర్తు ఉన్నదా?"అని వాల్మీకి కుశుడితో అన్నాడు.


" అవును గురూజీ నాకు బహుబాగా గుర్తు ఉన్నది" అని కుశుడు సమాధానాన్ని ఇస్తాడు.


"మరి నాకు ఇప్పుడు ఇస్తావా?" అని వాల్మీకి అడిగాడు.


"ధన్యుస్మి ప్రభు. తక్షణమే ఇస్తాను అడగండి"అని కుశుడు అంటాడు.


" నాకు తెలిసిన ఒక రాజు ఉన్నాడు. అతను ఒక నాగ వంశపు రాజులు. అతని కుమార్తె కుముద్వతి. తనని నువ్వు వివాహం చేసుకో. సుర్యవంశంతో సంబంధం కలుపుకోవాలనేది అతని కోరిక. తనని వివాహం చేసుకో." అని వాల్మీకి చిరు నవ్వుతో అడుగుతాడు.


గురువుపట్ల అభిమానం ఉన్న కుశుడు ఒప్పుకుంటాడు. 


"ఇంకొక 9 దినములలో నవమి వస్తుంది. ఆ రోజే మీ తండ్రి జన్మించాడు. ఇక్కడి ప్రజలు ఆ రోజుని ఘనంగా జరుపుకోవడానికి వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. ఆ రోజే మీరు వివాహం చేసుకోండి. ఎందుకంటే అంతకు మించిన మంచి రోజు ఉండదు." అని వాల్మీకి అంటాడు.

అయోధ్య ప్రజలంతా రాముడి పుట్టినరోజుని జరుపుటకు ఏర్పాట్లు మొదలుపెట్టారు. కుశుడు తన రాజ్యం పై నుంచి దాన్ని వీక్షిస్తూ మురిసి పోయి,అతని కళ్ళ నుండి ఆనందభాష్పాలు వస్తాయి.


ఆ రోజు రానే వచ్చింది. లవుడు కూడా వచ్చాడు. ప్రజలు అంత శ్రీ సీతారాములు కల్యాణం చెయ్యాలని ఆలోచన చేశారు. ఊరి ప్రజలంతా కుశుడి దగ్గరికి వచ్చి వివాహం కోసం విగ్రహాలు అడిగారు.

వాల్మీకి మహర్షి సూచనతో కుశుడు శ్రీ సీత రాములకు నమస్కరించి. లవకుశులు విగ్రహాలను వారి చేతులమీదుగా రాజ్యం మొత్తం పర్యటించి మండపానికి తీసుకెళ్తారు. శ్రీ సీతారాములు బ్రాహ్మణ వేషంలో అక్కడికి వచ్చి ఆతిథ్యం స్వీకరిస్తారు. కుశుడికి మరియు కుముద్వతికి వివాహం జరుగుతుంది. చుట్టుపక్కల రాజ్యప్రజలంతా అక్కడ జరిగే సీతారాముల కల్యాణాన్ని వీక్షించడానికి వచ్చారు.ఆ తరువాత అలాగే రాజ్య పరిపాలన సాగుతుంది. కానీ ఒక నాడు ఒక మత్స్య రాజు పెట్టిన శాపం వలన ప్రజల అవసరాలను కనుగొనలేదు. వారిని అసంతృప్తి పరిచాడు. కొన్ని సంవత్సరాల తరువాత హనుమంతుడు ఒక నాడు అయోధ్యను చేరుకుంటాడు. ఎందుకంటే కుశుడికి మరియు లవుడికి అసురుల హస్తంలో ముప్పు ఉన్నది.ఒక నాడు దుర్జయ అనే రాక్షసుడు అయోధ్య పై దాడికి వచ్చాడు.కుశ దుర్జయ అనే రాక్షసుడితో యుద్ధంలో పాల్గొంటాడు మరియు తన ప్రత్యర్థిని చంపే ప్రక్రియలో తన ప్రాణాలను ఇచ్చాడు.హనుమంతుడు కుశుడిని కాపాడాలని చాలా ప్రయత్నిస్తాడు కానీ సమస్య అతని చెయ్యి దాటి పోయింది. తరువాత దుర్జయుడిని చంపి అయోధ్యను అసురుల హస్తం నుంచి విడిపిస్తాడు. ఆ తరువాత కుశుడి కుమారుడైన అతిథి నీ అయోధ్యకు రాజుగా పటాభిషేకం చేస్తారు.


 ||జై శ్రీ రామ్||




Rate this content
Log in

Similar telugu story from Drama