Dinakar Reddy

Abstract Comedy Drama

4  

Dinakar Reddy

Abstract Comedy Drama

సరుకుల పట్టీ

సరుకుల పట్టీ

1 min
528


జయా! సరుకుల పట్టీ వ్రాయి. నేను ఆఫీసు నుండి వచ్చేటప్పుడు తీసుకువస్తాను ఆనందరావు.


జయ వంటింట్లో పని చేసుకుంటోంది. ఇవాళ నేనూ, అఖిల్ వెళతాం లెండి సూపర్ మార్కెట్ కి. అఖిల్ కి కూడా స్కూలు మధ్యాహ్నం వరకే అని చెప్పింది.


సరే అంటూ ఆనందరావు ఆఫీసుకు వెళ్ళిపోయాడు.


అదేంటి జయా! స్కూలుకు వెళ్లే పిల్లాడికి సరుకుల పని ఎందుకు? జయ అత్తగారు అడిగింది.


పర్లేదు అత్తయ్యా. అఖిల్ ఈ మధ్య చాలా డౌట్స్ అడుగుతున్నాడు అంది.


దేని గురించి? అంది జయ వాళ్ళ అత్తగారు.


కందిపప్పు ఏ రంగులో ఉంటే కొనాలి? ఏ నూనె వంటకు మంచిది? సోప్ లో కెమికల్స్ లేనివి ఏవి అని.


వాడికి స్కూల్లో ఏం చెబుతున్నారో కానీ, ఇవి మాత్రం బాగానే తెలుస్తున్నాయి. అయినా ఇవన్నీ తెలుసుకుంటే మంచిదే కదా. అందుకే సూపర్ మార్కెట్ కి తీసుకెళ్ళి సరుకులు అన్నీ వాడి చేతే కొనిపిస్తా. 


మీరు మీ అబ్బాయికి సరుకులు కొనడం బాగానే నేర్పించారు. మరి నా కొడుక్కి నేను నేర్పించొద్దూ అంది జయ.


తెలివైన కోడలివే అని నవ్వుకుంది జయ వాళ్ళ అత్తగారు.



Rate this content
Log in

Similar telugu story from Abstract