Dinakar Reddy

Abstract Fantasy Thriller

4  

Dinakar Reddy

Abstract Fantasy Thriller

సముద్రంలో ఎలిగే సుక్క

సముద్రంలో ఎలిగే సుక్క

1 min
643


అదిగో. అల్లంత దూరంలో ఏదో ఎలుగుతూ ఉంది. సూడు. నా చేయి ఉత్తరం పక్కకి సూపించాడు తిన్నడు.


అంతలో ఒక పెద్ద అల ఒకటి లేచింది. అదే రాకాసి కెరటం. మా ముసిల్ది చెప్తూ ఉండేది సముద్రానికి ఆకలెక్కువట. దాన్లో ఉన్న చేపలూ, రొయ్యలూ తినబుద్ధి కాదు.


అందుకే ఈ సునామీ అనీ ఇంకోటనీ పేరు సెప్పి మనుషుల్ని తినేస్తుంది. కానీ మనూరి ఊరి దేవత గంగానమ్మ అంటే సముద్రానికీ భయమే.


నేనేమో లగెత్తుకుని ఆ ఎలుతురు వైపే నడిపినా పడవ. రాకాసి అలను చీల్చుకుంటూ ముందుకు పోయినా అని ఆయాసపడుతూ చెబుతున్నాడు వీరన్న.


ఆ. అప్పుడు ఏమైంది?.. అని చిన్ని అడిగింది.


ఏమైంది? ఏమీ కాలేదు. కడుపుకు ఇంత కూడు తినే 

ఏలైంది అని సుట్టిల్లు నుంచి బయటికి వచ్చింది కళమ్మ.


ఏంది మావా ఈ కథలు. పిల్లలూ! ఇళ్ళకి పోయి కూడు తినండి అని కళమ్మ పిల్లలని ఇంటికి పంపేసింది.

ఉండు మావా! ఇద్దరం కూడు తిందాము అని సుట్టిల్లు లోపలికి పోయింది.


వీరన్న మంచం ఉంచిన రాయి ఎక్కి చూశాడు. అల్లంత దూరంలో సముద్రం. అమావాస్య రోజు అది. కేవలం నక్షత్రాలు మాత్రమే మిణుకు మిణుకుమని వెలుగుతూ కనిపించాయి.


వీరన్నకు సముద్రం మధ్యలో ఏదో వెలుతురు కనిపించింది. అదిగో ఎలుగుతుంది సుక్క. సూడు. సూడు అని అరిచాడు.


అతని మాటలు విని కళమ్మ ఆ ఆ ఎలుతురూ ఉంది. సీకటీ ఉంది. ఏం చూశాడో ఏమో ఆ సముద్రంలో. యాటకు పోవడం మానేసినాడు అంటూ కూర అన్నంలో కలిపింది.



Rate this content
Log in

Similar telugu story from Abstract