ప్రజల తీర్పు.
ప్రజల తీర్పు.
చలపతిరావు అనే లాయర్ కోర్టులో పనిచేస్తూ
ఉన్నారు. ఆయన ఎన్నో కేసులు వాదించారు.
చాలా కేసుల్లో నేరస్తులకు శిక్ష పడింది. అయితే
కొన్ని కేసుల్లో నేరం చేసినారు అని తెలిసినా తగిన సాక్ష్యం లేక నిర్దోషులుగా విడుదలైపోయిన వారూ ఉన్నారు. అందులో ఒక కేసు గురించి చలపతి
తన మితృలతో చెప్పాడు. అసలేమయిందంటే
పాతకక్షలతో ఒక రౌడీ షీటరుని హత్య చేసారు
అక్కడ ఉన్న స్ధానిక ప్రజలు. ఆ రౌడీ షీటరు తన
ఊరిలో ఉన్న ప్రజలను చాలా ఇబ్బంది పెట్టేవాడు.
వ్యాపారుల నుండి డబ్బులు వసూలు చేయటం
చేసేవాడు. మహిళలతో అసభ్యంగా ప్రవర్తిసూ
ఉండేవాడు. ఇతరుల భూముల్ని కబ్జా చేసేస్తూ
ఉండేవాడు. స్ధానికులు పోలీసు స్టేషన్లో అతనిపై
అనేక కేసులు పెట్టారు. రాజకీయ పలుకుబడి
ఉపయోగించి, డబ్బులు ఖర్చుపెట్టి తేలికగా ఆ
కేసులనుండి బయటపడేవారు. స్ధానికంగా ఉన్న
కొందరు యువకులకు ఈ విషయాలు నచ్చలేదు.
వారిని కూడా హింసించేవాడు ఆ రౌడీ షీటర్. ఆ
విధంగా జరుగుతుంటే ఆ యువకులకు అతనిపై
కోపం పెరిగింది. ఎలాగైనా ఆ రౌడీ షీటర్ కధను
ముగించాలని నిర్ణయం తీసుకున్నారు. అవకాశం
కోసం ఎదురుచూస్తున్నారు. ఒకరోజు రౌడీ తన
ఇంటినుంచి ఊరి సెంటరుకి వెళుతుండగా అక్కడ
ఉన్న యువకులంతా అతనిపై దాడి చేసారు. ఆ
రౌడీ అనుచరులు అక్కడ నుండి పరారయ్యారు.
రౌడీ షీటర్ స్పాట్లో చనిపోయాడు. పోలీసులు వచ్చి ఎంక్వైరీ చేసానా ఎవరూ వివరాలు చెప్పడం
జరగలేదు. అనీమానితులైన యువకులపై కేసు
పెట్టి కోర్టులో ప్రవేశపెట్టినా సరైన సాక్ష్యం లేక ఆ
కేసును కోర్టు కొట్టేసింది. రౌడీ షీటర్ ఆగడాలకు
ప్రజలే తీర్పు చెప్పారు.
