venkata Bhanu prasad chalasani MA.B.ed

Inspirational Others

4  

venkata Bhanu prasad chalasani MA.B.ed

Inspirational Others

ఆదాయవనరులు వెతకాలి

ఆదాయవనరులు వెతకాలి

1 min
321


జగన్ ఒక రైతు. కష్టపడి వ్యవసాయం చేసి పంట పండించి ఆ పంట అమ్మగా వచ్చే డబ్బుతో తన

జీవితం గడిపేవాడు. ఒకోసారి వరదలు వచ్చి ఆ

పంట నాశనం అయ్యేది. మరొకసారి సరైన వర్షం

లేక పంట సరిగ్గా పండేది కాదు. అతివృష్టి వలనే

కాక అనావృష్టి వలన కూడా పంటలు పండవు. 

అలాంటి పరిస్థితుల్లో జగజ్ చాలా ఇబ్బందులు

పడేవాడు. ఆర్ధికంగా చాలా నష్టపోయేవాడు. ఆ

సమయంలో జగన్ మామగారు జగన్ కు సలహా

చెప్పాడు. ఆయన చెప్పిందేమిటంటే వ్యవసాయం

చేయడంతో పాటు పశువుల పెంపకం చేపట్టడం

వలన పాలు అమ్మి కొంత రాబడి పొందవచ్చు.

అలాగే కోళ్ల పెంపకం వలన గుడ్లు, కోళ్లు అమ్మి

డబ్బులు పొందవచ్చు. గొర్రెల పెంపకం కూడా 

చేపట్టవచ్చు. వ్యవసాయానికి అనుబంధంగా

ఇలా ఏదైనా చేస్తే సంపాదన పెరుగుతుంది. ఏ

నష్టం లేకుండా వ్యవసాయం చేసుకోవచ్చు. తన

మామ సలహా విన్న జగన్ ఆ సలహాను అమలు

చేసేందుకు కృషి చేసాడు. మామ అన్నట్లుగానే

అతని రాబడి పెరిగింది. జగన్ సంతోషంగా తన

జీవితాన్ని గడపసాగాడు.



Rate this content
Log in

Similar telugu story from Inspirational