కలసిఉంటే కలదు సుఖం.
కలసిఉంటే కలదు సుఖం.
మహేష్ ఈ మధ్యనే పెళ్ళి చేసుకున్నాడు. పెళ్లికి
ముందు మహేష్ తల్లి మహేష్ బాగోగులన్నీ కూడా
చూసుకునేది. మహేష్ కు మూడుపూటలా వండి
పెట్టడం దగ్గరనుండి అన్ని అవసరాలూ దగ్గరుండి
చూసుకునేది. బీరువా తాళాలు ఆమె చేతులతో
ఉండేది. అలాంటిది మహేష్ పెళ్ళి అవగానే అతని
భార్య లత అతనికి వండిపెట్టడం మొదలుపెట్టింది.
అలాగే మహేష్ అవసరాలన్నీ తనే చూసుకోవటం
మొదలుపెట్టింది. అది మహేష్ తల్లికి నచ్చలేదు.
తన కొడుకు మహేష్ ని చిన్నతనం నుండీ అన్నీ తానై చూసుకునేది. అలాంటిది కోడలు రాగానే కొడుకు తన చేతులో నుండి భార్య చేతుల్లోకి
వెళ్ళిపోయినట్లు ఆమె భావించింది. సహజంగా
అసూయతో అత్తా కోడల్ల మధ్య చాలా గొడవలు
అయ్యాయి. వారిద్దరి మధ్యలో లక్ష్మీ పతి చాలా
నలిగిపోసాగాడు. అతని ఆరోగ్యం కూడా చాలా దెబ్బతింది. అప్పుడు విషయం గ్రహించిన అతని
తల్లి తన ప్రవర్తన వల్ల తన కుమారుడు ఇబ్బంది
పడుతున్నాడు అని భావించి తన ప్రవర్తన చాలా
మార్చుకుంది. తన కోడలికు ఇంటి బాధ్యతలన్నీ
అప్పచెప్పి భగవంతుని ధ్యానంలో గడపసాగింది.
అత్తాకోడలు కలిసిపోవటంతో ఇల్లు ప్రశాంతంగా
మారింది. లక్ష్మీపతి ఆరోగ్యం మెరుగుపడింది. ఆ
ఇల్లు స్వర్గంగా మారింది. కలసివుంటే కలదు సుఖం.
