STORYMIRROR

venkata Bhanu prasad chalasani MA.B.ed

Inspirational Others

4  

venkata Bhanu prasad chalasani MA.B.ed

Inspirational Others

మొహమాటపడితే లాభం లేదు.

మొహమాటపడితే లాభం లేదు.

1 min
416

మస్తాన్ రావు సీనియర్ సిటిజన్. ఆయనకు చాలా

మొహమాటం. ఎంతవసరం అయినా ఇతరులను సహాయం అడగాలంటే మొహమాటపడేవాడు. ఆ

మొహమాటం వల్ల అతని కుటుంబం కూడా చాలా

ఇబ్బంది పడింది. ఆయన ఇతరుల నుండి ఎలాటి సహాయం అడిగేవాడు కాదు. భోజనం దగ్గర కూడ

ఇదే పరిస్థితి. వడ్డించే వాడు ఎక్కువ పెట్టినా అది

వదలకుండా తినేవాడు. ఒకవేళ వడ్డించేవాడు తక్కువ పెట్టినా మళ్ళీ అడిగేవాడు కాదు. అతని

భార్య అతన్ని మార్చాలని ప్రయత్నం చేసింది కానీ

ఫలితం లేదు. మస్తాన్ రావు మితృడు మాత్రం

ఒక ఐడియాతో మస్తాన్ రావు మొహమాటం

అంతా పోగొట్టాడు. మస్తాన్ రావుకి యూ ట్యూబ్

చూడటం ఇష్టం. మస్తాన్ రావు మితృడు యూ

ట్యూబ్లో మితృల సహాయంతో ఒక వీడియో పోస్ట్ చేసాడు. ఆ వీడియోలో అతను మొహమాటం

వల్ల గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువ ఉంది.

బట్టతల కూడా వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉందని

చెప్పాడు. ఆ వీడియోను అతను మస్తాన్ రావుకి చూపించాడు. ఆ వీడియోను చూసిన మస్తాన్ 

రావు మొహమాటపడితే ప్రాణం పోతుంది అని

మొహమాటపడటం మానేసాడు. మితృలు ఆ

వీడియోని తర్వాత డిలీట్ చేసారు. మొత్తానికి

మొహమాటం పోయి ధైర్యంగా జీవించాడు మన

మస్తాన్ రావు.



రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu story from Inspirational