STORYMIRROR

venkata Bhanu prasad chalasani MA.B.ed

Inspirational Others

4  

venkata Bhanu prasad chalasani MA.B.ed

Inspirational Others

నవ్వుతూ బతకాలి.

నవ్వుతూ బతకాలి.

1 min
300

సీతమ్మ ఎప్పుడూ దిగులుగా ఉండేది. ఆమె

భర్త ఈ మధ్యనే కాలం చేసారు. కొడుకేమో 

అమెరికాలో స్ధిరపడ్డాడు. సీతమ్మ మాత్రం

గ్రామంలోనే నివసించేది. లంకంత ఇల్లు ఉన్నా

ఆమెను పలకరించే దిక్కు లేదు. దానికి కారణం

ఏమిటంటే ఆమె ఎప్పుడూ దిగులుగా ఉంటుంది.

పైగా ఎప్పుడూ కూడా తన బాధలను అందరికీ

చెప్పుకునేది. ఏదో కొన్ని రోజులు ఆ గోల భరించి

ఆ తర్వాత ఆమె దగ్గరకు రావటం మానేసారు

ఆ ఊరివారు. ఆ ఒంటరితనం ఆమెను మరింత

బాధపెట్టేది. ఒకసారి అలా ఒంటరిగా ఉన్నప్పుడు

ఆమెకు జ్ఞానోదయం అయ్యింది. ఎప్పుడూ ఏడిస్తే

ఎవరికయినా ఇబ్బందిగా ఉంటుంది. ఆనందంగా

నవ్వుతూ, నవ్విస్తూ ఉంటేనే జనాలు దగ్గరకు

చేరతారు. ఆ విషయం గ్రహించిన ఆమె తన

ప్రవర్తన మార్చుకుంది. ఎప్పుడూ నవ్వుతూ,

నవ్విస్తూ జీవితం గడపసాగింది. ఇదివరకు

ఆమెను దూరం పెట్టిన గ్రామస్తులు ఆమెతో 

అభిమానంగా ఉండసాగారు. సీతమ్మగారు

తన జీవితం ఆనందంగా గడపసాగింది.


Rate this content
Log in

Similar telugu story from Inspirational