హోలీ పండుగ కధ
హోలీ పండుగ కధ
పూర్వ కాలంలో హిరణ్యకశిపుడు అనే రాక్షసుడు ఉండేవాడు. ఆ రాక్షసుడు దేవతలను , మానవులను హింసించేవాడు. హిరణ్యకశిపుడు
శ్రీ మహావిష్ణువును అమితంగా ద్వేషించే వాడు. అతని పుత్రుడు
ప్రహ్లాదుడు మాత్రం విష్ణువుని
పూజించటం మొదలు పెట్టాడు.
ఆ విషయం హిరణ్యకశిపుడికి
చాలా కోపం తెప్పించింది. అతను
ప్రహ్లాదుడిని కొండలపై నుంచి
క్రిందకు తోయించాడు. విష
సర్పాల మధ్య వదిలివేశాడు.
ఎన్ని చేసినా విష్ణు మాయ వల్ల
ప్రహ్లాదుడికి ఏమీ కాలేదు. చివరికి
హోలిక ఒడిలో కూర్చుండబెట్టి
మంటల మధ్యలోకి తోసేశారు.
విష్ణు దేవుని కృపతో ప్రహ్లాదుడు
బ్రతికాడు. హోలిక మాత్రం మంటల్లో
కాలిపోయింది. చెడుపై మంచి సాధించిన విజయం కనుక ఆ రోజు ప్రజలు హోలీ పండుగ చేసుకున్నారు. ఆ తర్వాత శ్రీ మహా విష్ణువు నరసింహావతారం ధరించి ఆ హిరణ్యకశిపుడిని సంహరించి భక్తులను కాపాడాడు. హోలీ రంగుల పండుగ.
