మహిళాభ్యుదయం
మహిళాభ్యుదయం
మహేశ్వరి ఉపాధ్యాయులిగా పనిచేస్తోంది.
ఆమె అత్తగారికి తన కోడలు బయటకు వెళ్ళి
పని చేయటం ఇష్టం లేదు. పెళ్ళికి ముందు
నుండే ఉద్యోగం చేస్తోంది మహేశ్వరి. తన
కోడలిని ఎలాగైనా ఉద్యోగం మాన్పించాలి
అని మహేశ్వరి అత్తగారు రాజేశ్వరి చాలా
రకాలుగా ప్రయత్నం చేస్తోంది. రాజేశ్వరి భర్త
తల్లి మాటలను పరిగణనలోకి తీసుకోవటం
మొదలుపెట్టాడు. మహేశ్వరిపై ఉద్యోగం
మానమని ఒత్తిడి చేయసాగాడు. ఆ విషయం
రాజేశ్వరి అత్తగారికి తెలిసింది. ఆమె తన
కోడలైన రాజేశ్వరిని పిలిచి"మన రోజుల్లో
ఆడవాళ్లు బయటకు వెళ్ళి ఉద్యోగం చేయటం
జరిగేది కాదు. అత్తమామల, భర్త సహకారం
ఉండేది కాదు. నేటి రోజు మహిళలు ఉద్యోగం
చేయటం మామూలు విషయం. మహిళలు
ఉద్యోగం చేయటం వలన ఆమె కుటుంబం
కూడా ఆర్ధికంగా స్ధిరపడుతుంది. అందువల్ల
నీ కోడలిని ఉద్యోగం చెయ్యనివ్వు. మహిళగా
నువ్వు మహిళాభ్యుదయం కోసం నీ వంతు
సహకారం అందించు".అని చెప్పింది. అత్త
చెప్పిన సలహా రాజేశ్వరికి నచ్చింది. తన
కోడలైన మహేశ్వరికి తన పూర్తి సహకారం
అందించసాగింది. మహేశ్వరి పిల్లల బాధ్యత
తనే తీసుకుంది రాజేశ్వరి. ఆ విధంగా ఆమె
మహిళాభ్యుదయం కోసం తన వంతు చిన్న
ప్రయత్నం చేసింది.
