Shaik Sameera

Thriller


4  

Shaik Sameera

Thriller


ప్రేమ సంఘర్షణ

ప్రేమ సంఘర్షణ

4 mins 184 4 mins 184

               ఎపిసోడ్ -6

వంశ్ రిథిమా తో మనుషులు ఒక లాంటి లైఫ్ కి అలవాటు పడితే అంత తొందరగా వేరే లైఫ్ కి అలవాటు పడలేరు అందుకే నీకోసం మీ హాస్టల్ రూమ్ లాగే ఆరెంజ్ చేశాను ఈ రూమ్ .అవే కర్టెన్ స్ అదే బెడ్ అవే ఫొటోస్ అంటాడు . రిథిమా ఫొటోస్ అనగానే భయపడుతుంది అది చూసి వంశ్ అక్కడ ఉన్న ఒక ఫోటో ఫ్రేమ్ తీసుకొని చూస్తాడు .రిథిమా తను కబీర్ ఉన్న ఫోటో వంశ్ చూశాడేమో అని షాక్ అవుతుంది .ఎవరు ఈ ఫోటో లో ఉన్నది నీతో అంత క్లోజ్ గా ఉన్నారు ఏ రిలేషన్ ఉంది మీ మధ్య అని వంశ్ ఆ ఫోటో చూపించి అడుగుతాడు .సేజల్ తను ఉన్న ఫోటో చూసి కబీర్ తో ఉన్న ఫోటో ఏమైంది కబీర్ తీసేశాడేమో అనుకుంటుంది . కబీర్ రాజ్ వెళ్లక ముందే రిథిమా హాస్టల్ కి వెళ్లి తను రిథిమా ఉన్న ఫొటోస్ అన్ని మార్చేస్తాడు వంశ్ కి అనుమానం రాకుండా ఉండాలని .

వంశ్ -రిథిమా నీ ఆన్సర్ కోసం వెయిట్ చేస్తున్న అంటాడు 

రిథిమా -సేజల్ తను నా చిన్నప్పటి నుండి బెస్ట్ ఫ్రెండ్ .తను కూడా ఈవెంట్ మేనేజర్ లాగా వర్క్ చేస్తుంది .తనతోనే నేను కలిసి వర్క్ చేస్తూ ఉంటాను అని తన చేతిలో నుండి ఫోటో ఫ్రేమ్ తీసుకుంటుంది .

వంశ్ -రిథిమా వేలికి ఉంగరం ఉన్న గుర్తు చూసి వంశ్ నీ ఫియాన్సీ ఎక్కడ ఉన్నాడు అని అడుగుతాడు .

రిథిమా- ఎవరు ఫియాన్సీ నాకు ఎలాంటి లవర్ ఫియాన్సీ ఎవరు లేరు .అయిన మీకు నాకు ఫియాన్సీ ఉన్నారని మీకు ఎవరు చెప్పారు 

వంశ్ -ఫియాన్సీ ఇచ్చిన రింగ్ గుర్తు ఉంది ఫియాన్సీ లేడా interesting very ఇంటరెస్టింగ్ అని తన చేయి పట్టుకొని రింగ్ గుర్తు చూపిస్తాడు 

రిథిమా -ఫియాన్సీ ఇచ్చిన రింగ్ మాత్రమే పెట్టుకోవాలా సేజల్ నాకు రింగ్ ఇచ్చింది దాని గుర్తే ఇది అంటుంది .

వంశ్ -బెస్ట్ ఫ్రెండ్ ఇచ్చిన రింగ్ తీసేసావా తనకి తెలిస్తే ఫీల్ అవుతుంది కదా అంటాడు .

రిథిమా -MR.VR రింగ్ టైట్ అయింది వేలికి అందుకే తీసేసాను .అయిన రిలేషన్స్ గిఫ్ట్స్ వలన నిలబడవు మనసులో ఉంటాయి రిలేషన్స్ అని చెబుతుంది .వంశ్ వెళ్ళిపోతాడు తను డోర్ క్లోజ్ చేసుకొని టెన్షన్ నుండి రిలీఫ్ అవుతుంది .కబీర్ ఎందుకు ఇలా చేసాడు ఆ ఫొటోస్ ఎందుకు తీసేసాడు అవి వుంటే కబీర్ నాతోనే ఉన్నటు ఉండేది అనుకోని బాధపడుతూ తన హ్యాండ్ బ్యాగ్ నుండి కబీర్ తనకి ఇచ్చిన రింగ్ లో వాళ్ళ ఇద్దరి ఫోటో ఉన్నది చూసుకుంటూ ఇది ఒక్కటే కబీర్ జ్ఞాపకం నా దగ్గర ఉంది ఇది ఎవరికీ కనిపించకుండా దాచాలి అని రింగ్ తన చైన్ లో వేసుకొని మెడలో వేసుకుంటుంది .కబీర్ ఈ రింగ్ ని నా హృదయానికి దగ్గరలోనే ఎప్పటికి ఉండేలా చూసుకుంటాను అని బాధపడుతుంది .

కబీర్ కూడా రిథిమా తను ఉన్న ఫొటోస్ కాలుస్తూ మన జ్ఞాపకాలన్నీ మాత్రమే కాలుస్తున్న మన ప్రేమని కాదు .ఇప్పటికి దూరంగా ఉన్న మనం మిషన్ అయిపోయిన వెంటనే ఎప్పటికి విడిపోము ఎప్పటికి కలిసే ఉంటాము అని బాధపడుతూ ఫొటోస్ అన్ని కాల్చేస్తాడు .మనం దూరంగా ఉన్న కలిసే వంశ్ ని అంతం చేస్తాం మనమిద్దరం రిథిమా అని బాధపడతాడు కబీర్ .రిథిమా తనకి కబీర్ ఇచ్చిన మేకప్ కిట్ లా ఉండే ట్రాన్స్మిటర్ ని తీసుకొని కబీర్ చెప్పినట్టే కనెక్ట్ చేసి బటన్ ప్రెస్ చేస్తుంది కానీ కబీర్ తో మాట్లాడటానికి సిగ్నల్ ఉండదు తన రూంలో .రాత్రి అయ్యాక బయటికి వెళ్లి కబీర్ తో మాట్లాడాలని ఎదురు చూస్తూ ఉంటుంది .

రిథిమా ట్రాన్స్మిటర్ సిగ్నల్ కోసం సెర్చ్ చేస్తూ బయటికి వెళ్తూ వుండగా డిసోజా వంశ్ హౌస్ కేర్ టేకర్ రిథిమా ని చూసి పిలుస్తుంది వంశ్ అమ్మ అను ప్రియా పిలుస్తున్నారు అని చెబుతుంది .రిథిమా ట్రాన్స్మిటర్ తన దగ్గర ఉన్న బ్యాగ్ లో పెట్టుకొని ఎవరికీ కనపడకుండా దాస్తుంది .డిసోజా తో తరువాత వస్తాను అంటే కుదరదు ఇప్పుడే రావాలని రిథిమా ని తీసుకెళ్తుంది .రిథిమా ని చూసి వంశ్ అమ్మ అనుప్రియ ఎక్సపీరియెన్స్ లేని ఈ అమ్మాయిని వంశ్ ఎలా సెలెక్ట్ చేసాడు అంటుంది .వంశ్ బాబాయ్ వంశ్ సెలెక్ట్ చేస్తే కరెక్టుగా ఉంటుంది వదిన dont worry అంటాడు . రిథిమా తో ఆర్యన్ క్రూయిజ్ లో ఆగిపోయిన మన స్టోరీ ఇక్కడ కంప్లీట్ చేద్దాం అని రిథిమా తో సీక్రెట్ గా చెబుతాడు రిథిమా భయపడుతుంది .అప్పుడే వంశ్ వచ్చి సియా కోసమే తనని ఇక్కడికి తీసుకొని వచ్చాను అని చెబుతాడు .అనుప్రియ తన గురించి మనకి తెలియదు కదా అంటుంది .వంశ్ తన గురించి మొత్తం ఎంక్వయిరీ చేయించాను dont worry అంటాడు .సియా నాకు బాగవుతుంది కదా నేను నడవగలను కదా అని రిథిమా ని అడుగుతుంది .అప్పుడే అక్కడికి వచ్చిన వంశ్ నానమ్మ రిథిమా ని చూసి మంచి అమ్మాయిల ఉంది ఎందుకు తనని భయపెడుతున్నారు మీ అనుమానాలతో అంటుంది .అనుప్రియ రిథిమాతో ఇంటి రూల్స్ చెబుతుంది .ఇషాని డిన్నర్ చేద్దాం అంటుంది .

వంశ్ ఫ్యామిలీ తో డిన్నర్ చేస్తూ వుండగా వంశ్ నానమ్మ రిథిమా ని కూడా వాళ్ళతో పాటు కూర్చొని డిన్నర్ చేయమంటుంది .ఇషాని తను స్టాఫ్ ఇక్కడ వర్క్ చేయడానికి వచ్చింది అంటుంది .వంశ్ నానమ్మ అయితే ఏమైంది మనతోనే డిన్నర్ చేస్తుంది అని రిథిమా ని పిలుస్తుంది .రిథిమా పర్లేదు నేను తరువాత తింటాను అంటుంది ట్రాన్స్మిటర్ ఎవరైనా చూస్తారని .సియా కూడా రిథిమా ని పిలుస్తుంది .ఇషాని రిథిమా తన పక్కన ఎక్కడ కూర్చుంటుందో అని పక్కకి వెళ్ళిపోతుంది .వంశ్ అందరూ పిలుస్తున్నారు వచ్చి కూర్చో అంటాడు .రిథిమా వచ్చి కూర్చుంటుంది వంశ్ నానమ్మ ఫుడ్ ఇస్తుంది తనకి తను తింటూ వుండగా ట్రాన్స్మిటర్ కింద పడిపోతుంది .ఆర్యన్ ట్రాన్స్మిటర్ చూసి వంశ్ కి చూపిస్తాడు తను స్పై అని చెబుతాడు .రాజ్ తన గన్ రిథిమా పైన పెట్టి షూట్ చేయాలి అనుకుంటాడు .వంశ్ అగు రాజ్ ఇలా అంత ఈజీ గా తను చావకూడదు అని ఆ గన్ తను తీసుకొని రిథిమా కి గురి పెడతాడు ఎవరు నువ్వు చెప్పు అంటాడు .రిథిమా తన నిజం తెలిసిపోయిందని కబీర్ ని మనసులో తలుచుకుంటుంది .Rate this content
Log in

More telugu story from Shaik Sameera

Similar telugu story from Thriller