Shaik Sameera

Thriller

3  

Shaik Sameera

Thriller

ప్రేమ సంఘర్షణ

ప్రేమ సంఘర్షణ

4 mins
270


            ఎపిసోడ్ -16

రిథిమా వంశ్ స్టడీ రూంలోకి వెళ్లి వంశ్ మాటలు మాత్రమే విన్న రిథిమా ఫైల్స్ అనుకోని వెతుకుతూ ఉంటుంది.కప్ బోర్డు ఓపెన్ చేయాలనీ చూస్తుంది అది ఓపెన్ కాకపోయేసరికి దాని కీ కోసం వెతకడం మొదలు పెడుతుంది .వంశ్ చేతికి సియా రాఖీ కడుతుంది తనకి వంశ్ రెండు గిఫ్ట్స్ ఇస్తాడు .ఇషాని అన్నయ్య నా గిఫ్ట్ ఏది అంటే సారీ ఇషాని లాక్ డౌన్ వలన నువ్వు అడిగిన గిఫ్ట్ తీస్కోనిరాలేకపోయాను అనగానే ఇషాని అప్సెట్ గా చూస్తుంది.చెల్లెలు అడిగింది చేయకపోతే తను అన్నయ్య ఎలా అవుతాడు అని తను అడిగిన కార్ కొని కార్ కీస్ తనకి ఇస్తాడు.అది చూసి హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇషాని.ఆర్యన్ నేను మీ అన్నయ్యనే చూడండి నేను ఏం గిఫ్ట్స్ తెచ్చానో అని ఇషాని,సియాతో అంటాడు.వంశ్ కి ఫోన్ కాల్ వచ్చేసరికి పక్కకి వెళ్తాడు.రిథిమాకి కప్ బోర్డు కీ దొరుకుతుంది దానితో కప్ బోర్డు open చేస్తుంది.ఫోన్ మాట్లాడుతున్న వంశ్ కి ఏదో సౌండ్ వినిపించి పైకి వెళ్తాడు.

రిథిమా కప్ బోర్డు ఓపెన్ చేసి ఏదైనా ఫైల్స్ ,పెన్ డ్రైవ్ లో వంశ్ ఇల్లీగల్ బిజినెస్ కి సంభందించిన ప్రూఫ్స్ ఉండొచ్చు అని షీరాని చూసి కూడా ప్రూఫ్స్ కోసం వెతుకుతూ ఉంటుంది.వంశ్ అంతలో స్టడీ రూంలోకి వస్తాడు.రిథిమా వంశ్ వస్తున్నా అడుగుల సౌండ్ విని కప్ బోర్డులో దాక్కుంటుంది వంశ్ కి కనిపించకుండా.వంశ్ స్టడీ రూమ్ అంతా వెతికి కప్ బోర్డు ఓపెన్ చేయబోతుంటే సియా వంశ్ ని నానమ్మ పిలుస్తుందని చెప్పడంతో కిందకి వెళ్ళిపోతాడు.రిథిమా వంశ్ వెళ్ళిపోయాక కప్ బోర్డు ఓపెన్ చేయాలనీ చూస్తే ఓపెన్ కాదు.రిథిమాకి కబీర్ ఇచ్చిన ట్రైనింగ్ గుర్తు వస్తుంది.రిథిమాకి కబీర్ మన భయమే మనలన్నీ ఓడిస్తుంది ఎటువంటి పరిస్థితి అయిన భయపడకుండా ఆలోచించమనడం గుర్తొచ్చి రిలాక్స్ అయ్యి కప్ బోర్డు ని తన హెయిర్ పిన్ తో ఓపెన్ చేస్తుంది.కప్ బోర్డు నుండి బయటికి వచ్చిన రిథిమా కబీర్ నీ ప్రేమ ఇప్పుడు నా బలం అయిపోయింది ప్రతి సమస్య నుండి నన్ను బయటపడేస్తుంది అనుకుంటుంది .

రిథిమా ఎవరో వస్తున్నట్టు సౌండ్ విని కప్ బోర్డు ఎలా ఉందో అలా సెట్ చేస్తూ వుండగా తన చేయి తగిలి షీరా కింద పడిపోతుంది.రిథిమా అదే ప్రూఫ్ అని తెలియక షీరా తిరిగి పెట్టేయబోతుంది కానీ ఎవరో వస్తున్నా సౌండ్ విని టెన్షన్ లో షీరాని పెట్టేలోపు అది డస్ట్ బిన్ లో పడిపోతుంది.రిథిమా ఎవరో వస్తున్నారని తొందరగా కప్ బోర్డు క్లోజ్ చేసి వెళ్ళిపోతుంది.రిథిమా మెట్ల మీద నిల్చొని ఏ ప్రూఫ్ దొరకలేదు అని మళ్ళీ ప్రయ్నతించాలి అనుకుంటూ వుండగా వంశ్ తన వేలికి తొడిగిన రింగ్ చూసి కబీర్ ని గుర్తు చేసుకుంటూ కబీర్ ఎక్కడ ఉన్నావు ఇక్కడ నా పెళ్లి జరగబోతుంది అది నేను ఎవరిని అయితే ఎక్కువ అసహ్యించుకుంటానో,ఎవరిని అయితే జైలుకి పంపించాలి అనుకుంటున్నానో అతనితో ఏదో ఒకటి చేయి ప్లీజ్ హెల్ప్ చేయి అనుకుంటూ మెట్లు దిగితుంటే రిథిమా కాలు స్లిప్ అయ్యి కింద పడబోతోంది.వంశ్ వచ్చి రిథిమాని కింద పడకుండా పట్టుకుంటాడు.రిథిమా,వంశ్ ఒకరిని ఒకరు చూసుకుంటారు.

రిథిమా తన మెడలో నుండి చైన్ బయటికి రావటం చూసి వంశ్ నుండి దూరం జరిగి తన చైన్ వంశ్ కి కనపడకుండా దాచుకొని ఏమైంది అని వంశ్ ని అడుగుతుంది. 

వంశ్- strange చెడ్డవాడిని నేను కదా కానీ చెడ్డతనం నీ దగ్గర ఉంది సేవ్ చేస్తే కనీసం థాంక్స్ కూడా చెప్పట్లేదు.అయిన interesting mater పడిపోయేంతగా ఏం ఆలోచిస్తున్నావు మన పెళ్లి గురించా అని అడుగుతాడు .

రిథిమా -ofcourse ఈ టైములో పెళ్లే కదా ఇంపార్టెంట్ .అంతా ఎలా వుందంటే నాకు ఏదో కలలా ఉంది అంటుంది .

వంశ్ -రిథిమా దగ్గరికి వచ్చి కలలు అందంగా ఉండాలి కదా అని చిటికె వేస్తాడు డిసోజా రెడ్ roses boke తీసుకొని తెచ్చి ఇచ్చి వెళ్ళిపోతుంది .వంశ్ ఆ బొకే తీసుకొని రిథిమాకి చూపిస్తూ ఈ పూలకి ప్రేమకి కనెక్షన్ ఉంది కదా ఈ పూలు మన గార్డెన్ నుండి తెప్పించాను నీకోసం.మన పరిచయం అంతా బాగా జరగలేదు అందుకే నాకు కాబోయే భార్యకి రొమాంటిక్ గా ఉండేలా ఏదైనా ఇద్దామని అనిపించింది.Iam sure you like it నువ్వు కూడా అలాంటి టైప్ అమ్మాయివే కదా ప్రేమ,పూలు,ఆకాశంలో నక్షత్రాలు,చందమామని చూడటం అని అంటాడు .

రిథిమా -మంచిదయ్యింది మీకు ప్రేమ,పూల గురించి కూడా తెలుసు not బాడ్ .కానీ roses ఒంటరిగా ఉండవు వాటితో పాటు ముళ్ళు ఉంటాయి గుచ్చుకోడానికి .మీకు బాధ పెట్టడమే తెలుసా బాధని భరించడం కూడా వచ్చా .మీకు తెలియకపోతే తయారు అయిపోండి గులాబీ లాగే ప్రేమలో కూడా కొన్ని గుచ్చుకుంటాయి చాలా బాధేస్తుంది ఇవ్వండి అని తీసుకునేలోపు వంశ్ కి గులాబీ ముళ్ళు గుచ్చుకుంటుంది నొప్పితో హా అంటాడు తన వేలి నుండి బ్లడ్ వస్తుంది.రిథిమా ఏమైంది అంటుంది గులాబీ ముళ్ళు గుచ్చుకుంది అంటాడు వంశ్ ఇంత చిన్నదానికే హా వచ్చేసిందా అని గులాబీలు చూస్తూ ఉంటుంది.

వంశ్ -నీకు అనిపిస్తుందా నాకు ప్రేమ గురించి తెలియదు అని అడుగుతాడు.

రిథిమా -ofcourse ప్రేమంటే రొమాంటిక్ వస్తువులు కావు.చాలా త్యాగాలు చేయమంటుంది ప్రేమ.కాండిల్ లైట్ డిన్నర్ చేయడం ప్రేమ కాదు బాధలో ఉండి కూడా తోడు వదలకపోవడం ప్రేమ.ఏదో కొన్ని క్షణాల సంతోషం కాదు ప్రేమ జీవితాంతం తోడు ఉండే commitment ప్రేమ.ప్రేమలో సుఖము ఉంది దుఃఖము ఉంది .ప్రేమలో చీకటి ఉంది వెలుగు ఉంది. ప్రేమ బాధని ఇస్తుంది అలాగే బాధకి మందు కూడా ప్రేమే.ప్రేమే జీవితాన్ని ఇస్తుంది అలాగే ప్రేమే చావు కూడా ఇస్తుంది అంటుంది.

రిథిమా మాటలకి వంశ్ షాక్ అయ్యి రిథిమానే చూస్తూ ఉంటాడు.వంశ్ కి రాజ్ కాల్ చేస్తాడు.షీరా కనిపించట్లేదని చెబుతాడు వంశ్ తో అందుకు వంశ్ అలా ఎలా కనిపించకుండా పోతుంది అని వంశ్ టెన్షన్ గా వెళ్ళిపోతాడు.వంశ్ టెన్షన్ పడటం చూసి వంశ్ వెనకే ఫాలో అవుతూ వెళ్తుంది.రాజ్ షీరా సేఫ్ లో లేదని చెప్పేసరికి అలా ఎలా మిస్ అయింది నిన్ను షీరా ని సేఫ్ గా పెట్టమని చెప్పా కదా.నీకు తెలుసు కదా షీరా లో నా బిజినెస్ డీలింగ్స్,కాంటాక్ట్స్ ,కోడింగ్ అన్ని ఉన్నాయి అవి ఎవరికీ అయిన దొరికితే పోలిసుల వరకు వెళ్తుంది.వంశ్ ని అంతం చేసే శక్తి షీరా కి ఉంది షీరా ఎలాగైనా దొరికి తీరాలి అని వెళ్ళిపోతారు.అదంతా వింటున్న రిథిమా షీరా ఏంటి ఏదైనా కోడ్ లేదా ఏదైనా వస్తువా అని ఆలోచిస్తూ వుండగా కప్ బోర్డు లో సింహం తల ఉన్న బొమ్మ తన చేయి తగిలి డస్ట్ బిన్ లో పడిపోయిన బొమ్మే షీరా అని తెలుసుకొని ప్రూఫ్ కి అంత దగ్గరగా ఉండి కూడా తెలుసుకోలేకపోయానని వంశ్ కన్నా ముందే తనే షీరా ని తీసుకోవాలని అనుకుంటుంది.షీరా నే తనని ఇక్కడ నుండి ఈ పెళ్లి నుండి తప్పించగలదని అలాగే వంశ్ ని జైలుకి పంపించగలదని అనుకోని you finished MR.VANSH RAI SINGHANIA అని స్టడీ రూంలోకి వెళ్లి షీరా పడిన డస్ట్ బిన్ కోసం వెతుకుతుంది.టేబుల్ కింద ఉంటుంది డస్ట్ బిన్ దాన్ని తీసుకొని షీరా కోసం వెతుకుతుంది అందులో షీరా ఉండదు.క్లీనింగ్ చేసాక చెత్త అంత బయట పడేసారేమో అనుకోని వెతకడానికి వెళ్తుంది .



Rate this content
Log in

Similar telugu story from Thriller