Shaik Sameera

Thriller


3  

Shaik Sameera

Thriller


ప్రేమ సంఘర్షణ

ప్రేమ సంఘర్షణ

5 mins 125 5 mins 125

             ఎపిసోడ్ -10

ఆర్యన్ వైపు వంశ్ అనుమానంగా చూస్తూ వుంటే వంశ్ బాబాయ్ ,పిన్ని ఆర్యన్ immature అంతే కానీ నీకు ఎగైనెస్ట్ గా ఎప్పుడు ఏం చేయడు .వంశ్ బాబాయి రాఘవ్ నీకు ఎగైనెస్ట్ గా వెళితే ఏం అవుతుందో తెలుసు తను ఏం చేయలేదు అంటాడు .వంశ్ పిన్ని ఆర్యన్ ఎలాంటివాడైన ఇలా చేయడు రిథిమానే చేసి ఉంటుంది ఇదంతా అంటుంది .వంశ్ ఆర్యన్ తో నిజం ఏంటో చెప్పు అని అడుగుతాడు .నిజమే చెబుతున్నాను ఇదంతా రిథిమానే చేసింది తన నిజస్వరూపం మీ ముందు నేను బయటపెడతానని ఇలా నన్ను ఇరికిస్తుంది అంటాడు ఆర్యన్ .అయిన ఈ ఇంటి ఇన్ఫర్మేషన్ నేను ఇవ్వాలనుకుంటే డైరెక్టుగా ఇవ్వగలను ట్రాన్స్మిటర్ అవసరం నాకు లేదు ఎందుకంటే నేను ఈ ఇంటి నుండి బయటికి వెళ్లే స్వాతంత్రం నాకు ఉంది అంటాడు ఆలోచించండి అంటాడు ఆర్యన్ .అది విని రాఘవ్ నిజమే కదా వంశ్ మన ఇంట్లో రిథిమాకి మాత్రమే ఎక్కడికి వెళ్లేందుకు అధికారం లేదు తనకి మాత్రమే ట్రాన్స్మిటర్ అవసరం తనదే అంటాడు .ఇషాని తనే మన ఇంట్లో కొత్తగా వచ్చింది కూడా తనే చేసి ఉండాలి తనని కనిపెట్టలేకపోతున్నాము అంతే మనం అనగానే వంశ్ ఇషాని తెలుసుకోడానికి కనిపెట్టడానికి చాలా తేడా ఉంది అయిన నా నుంచి ఎవరి ఐడెంటిటీ కూడా దాగదు అంటాడు .

కబీర్ రిథిమా ఏదో ప్రమాదంలో ఉందని భయపడుతూ ఉంటాడు .మిశ్రా బాస్ మీరు ఆర్యన్ పేరు చెప్పారు ఏంటి చెప్పండి అంటాడు .అంత సేపు సైలెన్స్ ఉంది అంటే ట్రాన్స్మిటర్ రిథిమా దగ్గర లేదని అర్థం అయింది తనకి ట్రయినింగ్ ఇచ్చాను ఎవరైనా పక్కన వుంటే ట్రాన్స్మిటర్ డిస్కోనెక్ట్ చేయమని అంతే కానీ సైలెన్స్ గా ఉండమని కాదు .మిశ్రా అయిన ఆర్యన్ పేరే ఎందుకు చెప్పారు తను వంశ్ ఫ్యామిలీ మెంబెర్ కదా నమ్ముతాడా రాజ్ ఉన్నాడు కదా తన పేరు చెప్పొచ్చు కదా అంటాడు .అందుకు కబీర్ రాజ్ అంటే వంశ్ కి చాలా నమ్మకం తన పేరు చెబితే నమ్మేవాడు కాదు .ఆర్యన్ కి వంశ్ అంటే నచ్చదు వంశ్ స్థానం కావాలని అనుకుంటూ ఉంటాడు .అందుకే ఆర్యన్ పేరు చెప్పాను తనకి రిథిమా మీద అనుమానం రాకుండా అంటాడు .

రిథిమా -మీకందరికీ నేనే ఇదంతా చేస్తున్నాని అనిపిస్తుందా .నేను ఇంత ప్లానింగ్ తో మీ ఇంటికి వస్తే మీరు ఇచ్చిన జాబ్ ఆఫర్ ని ఎందుకు రిజెక్ట్ చేస్తాను అని వంశ్ ని అడుగుతుంది .

వంశ్ -ఎందుకంటే నేను ఆఫర్ ఇచ్చిన వెంటనే నువ్వు ఒప్పుకొని వుంటే నాకు నీ మీద అనుమానం వస్తుందని తెలిసి రిజెక్ట్ చేసి ఉంటావు .

రిథిమా - నేను అంత ప్లాన్ చేసి వుంటే ట్రాన్స్మిటర్ లో నా పేరే వచ్చేది కదా ఆర్యన్ పేరు ఎందుకు చెబుతాడు .

వంశ్ -రిథిమా రెండువైపులా సైలెన్స్ ఉంది .అది సైన్ లా అనుకోని ఆర్యన్ పేరు చెప్పాడు .అతనెవరో చాలా స్మార్ట్ లా ఉన్నాడు .అతను ఆర్యన్ కాకుండా రాజ్ పేరు కూడా చెప్పొచ్చు కానీ చెప్పలేదు ఎందుకంటే రాజ్ పేరు చెబితే నాకు అనుమానం వస్తుందని నమ్మనని ఆర్యన్ పేరు చెప్పాడు.

రిథిమా - ఆ మేకప్ కిట్ నాది అని కూడా ఎటువంటి ప్రూఫ్స్ లేదు కదా అని అడుగుతుంది .

వంశ్ - ప్రూఫ్ అయితే ఉంది ఈరోజు నువ్వే నా స్టడీ రూంలోకి వచ్చావు .ఈ కిట్ నా స్టడీ రూమ్ కిటికీ బయట ఉంది .అలాగే గార్డెన్ లో నువ్వే ఏదో వెతుకున్నట్టు కనిపించావు .

రిథిమా -ఇదంతా నేనే చేస్తే మీకోసం పెట్టిన పూజ లో నేను ఎందుకు పాల్గొంటాను అంటుంది .

అప్పుడు వంశ్ నానమ్మ వంశ్ తో రిథిమా పూజ లో నాకు సహాయo మాత్రమే కాదు నీకోసం దేవుడి దగ్గర ఆరాధన కూడా చేసింది అంటుంది .

వంశ్ -నువ్వు పూజ కోసం నానమ్మ ని కాదనలేవు .పూజ మాత్రం చేసావు కానీ ఆరాధన మనసులో నాకోసం చేసావో మరి ఇంకెవరి కోసమైనా చేసావో తెలియదు కదా అంటాడు .

రిథిమా -MR.VR అనుమానం మనిషి అతి పెద్ద బలహీనత అవుతుంది .మీరు మిమ్మలన్నీ అందరిని నమ్మడం నేర్చుకోండి లేకపోతే ఏదో ఒక రోజు మీ జీవితంలో అమూల్యమైనది కోల్పోవలసి వస్తుంది అంటుంది .

వంశ్ -నువ్వు ఏదైతే నా బలహీనత అంటున్నావో అదే నా బలం దానివలనే ఇంతవరకు నా వరకు ఎవరు రాలేకపోయారు అంటాడు .ఇంకేదైనా ఉందా అంటాడు .

రిథిమా -మీ ఇంట్రాగేషన్ అయిపోతే నేను నా రూమ్ లోకి వెళ్తాను అంటుంది 

వంశ్ -నో ఈ విషయం ఇక్కడితో అయిపోలేదు .ఆర్యన్ రేపు మార్నింగ్ వరకు టైమ్ ఇస్తున్న రిథిమా దే ట్రాన్స్మిటర్ అని ప్రూవ్ చేయాలి అంటాడు .అలాగే రిథిమా తో ఈ రాత్రి వరకు బ్రతికి ఉండు రేపు ఏం జరుగుతుందో తెలియదు కదా అని వెళ్ళిపోతాడు .

ఇంట్లో వాళ్ళందరూ వెళ్ళిపోతారు వంశ్ వెళ్ళిపోయాక .ఆర్యన్ రిథిమాని చూసి నీ తప్పు ప్రూవ్ చేస్తాను తప్పకుండా అని వెళ్ళిపోతాడు .రిథిమా టెన్షన్ గా రూమ్ లోకి వెళ్లి డోర్ వేసుకొని ఏడుస్తూ కబీర్ ఇచ్చిన రింగ్ చూస్తూ వంశ్ కి నా మీద అనుమానం వచ్చింది తను నన్ను పట్టుకొని చంపేస్తాడు .ఈ విషయం కబీర్ కి ఎలా చెప్పాలి అనుకుంటూ వుండగా కబీర్ తనకి ఏదైనా డేంజర్ అనిపిస్తే ఒక రెడ్ క్లోత్ తీసుకొని మూడు ముడులు వేసి ఇంటి బయట విసిరేయమని వంశ్ ఇంటి మీద నిఘాకి ఒక మనిషిని పెట్టానని అతను ఇంటిమేట్ చేయగానే పోలీస్ లని తీస్కొచ్చి నిన్ను కాపాడుకుంటాను అని చెప్పడం గుర్తొచ్చి రెడ్ క్లోత్ కోసం వెతుకుతాడు తన రూమ్ అంతా రెడ్ క్లోత్ పూజ గదిలో ఉండటం గుర్తొచ్చి రాత్రి అవ్వగానే అందరూ పడుకోగానే రెడ్ క్లోత్ తీసుకోవాలని అనుకుంటుంది .

వంశ్ వాలీ బాల్ ఆడుతూ ఉంటాడు అప్పుడే రాజ్ ఒక ఫైల్ తీస్కోచి వంశ్ సంతకం కావాలని అడుగుతాడు .అప్పుడు వంశ్ నీకేమనిపిస్తుంది రాజ్ ఎవరు అనిపిస్తుంది culprit నీకు ఆర్యన్ or రిథిమా నా అని అడుగుతాడు .రాజ్ బాస్ రిథిమా అయితే ట్రాన్స్మిటర్ లో ఆర్యన్ పేరు ఎందుకు చెబుతారు అలా అయితే రిథిమా మీద మీకు doubt వుంటే తన మీద ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయొచ్చు కదా అంటాడు .రాజ్ నేను ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశాను రిథిమా ఆర్యన్ పేరు చెప్పగానే రిలాక్స్ ఫీల్ అయ్యి తనని పంపించిన వాళ్ళని కాంటాక్ట్ చేస్తుంది ఆ తప్పే తనని పట్టిస్తుంది మనకి చూద్దాం ఇదంతా చేస్తున్నా ఆ వ్యక్తి ఎవరో తెలుసుకుందాం అంటాడు .రిథిమా రూమ్ నుండి బయటికి వచ్చి పూజ మందిరానికి వెళ్లి రెడ్ క్లోత్ తీసుకొని ఎవరు చూడకుండా దాచుకొని తీసుకొని కిటికీ దగ్గరికి వెళ్తుంది .రిథిమా ఆ క్లోత్ కి మూడు ముడులు వేసి బయటపడేస్తుంది .ఇదంతా ఆర్యన్ చూసి తన ఎవరికీ సిగ్నల్ ఇస్తున్నావు ఈ రెడ్ క్లోత్ తో అంటాడు .అందుకు రిథిమా నేను ఎవరికీ సిగ్నల్ ఇవ్వట్లేదు అంటుంది .ఆర్యన్ రిథిమా చేయి పట్టుకొని అన్నయ్య అని పిలుస్తూ లాక్కొస్తాడు హాల్ లోకి .రిథిమా వదులు నా చేయి ఆర్యన్ నేను ఏం చేయలేదు నొప్పేస్తుంది చేయి అంటుంది .ఆర్యన్ పిలుపు విని వంశ్,రాజ్ హాల్ లోకి వస్తాడు .ఆర్యన్ రిథిమా చేయి పట్టుకోవడం రిథిమా వదిలించుకోవాలని చూడటం చూసి స్టాప్ ఇట్ అని అరుస్తాడు .ఆర్యన్ వంశ్ తో అన్నయ్య రిథిమా రెడ్ క్లోత్ తో ఎవరికో సిగ్నల్ ఇస్తుంది అని చెబుతాడు .

అది విని వంశ్ ఎవరికీ సిగ్నల్ ఇస్తున్నావు చెప్పు అని రిథిమా ని అడుగుతాడు .రిథిమా చెప్పేలోపు ఏదైనా చెప్పే ముందు ఒకటి గుర్తు పెట్టుకో అబద్ధం చెప్పాలని అనుకోవద్దు ఎందుకంటే ఆ క్లోత్ తెప్పించి చూడటానికి నాకు 2mins కూడా పట్టదు కాబట్టి నిజం చెప్పు అంటాడు .రిథిమా మార్నింగ్ వంశ్ నానమ్మ తుప్పు పట్టిన మేకులన్నీ ఒక క్లోత్ లో చుట్టి బయట పడేయమని డిసోజా కి చెప్పటం గుర్తొచ్చి MR.VR నేను మీకు మంచే చేయాలి అనుకుంటాను కానీ మీరు నమ్మరు నన్ను అంటుంది రిథిమా .తుప్పు పట్టిన మేకులు ఇంట్లో ఉండటం అశుభం అని నానమ్మ చెప్పారు నా రూమ్ బయట అలాంటి మేకులు కనిపిస్తే వాటిని క్లోత్ లో చుట్టి బయటపడేసాను అంతే కానీ ఎవరికీ సిగ్నల్ ఇవ్వట్లేదు అంటుంది .అప్పుడే వచ్చిన ఇషాని మీ మిడిల్ క్లాస్ వాళ్ళకి excuses కూడా ఈజీ గా దొరికేస్తాయి కదా అంటుంది .అశుభం మేకులు కాదు నువ్వు ఎప్పుడైతే ఇక్కడికి వచ్చావో అప్పుడే కష్టాలు start అయ్యాయి ఈ ఇంట్లో నిన్ను పడేయాలి ఇంటి బయటికి ముందు అంటుంది .వంశ్ రాజ్ తో క్లోత్ తీసుకొని రమ్మని పంపిస్తాడు .రిథిమా మనసులో వంశ్ ఆ క్లోత్ చూస్తే తను చెప్పింది అబద్ధం అని తెలిసిపోతుందని భయపడుతూ ఉంటుంది .


Rate this content
Log in

More telugu story from Shaik Sameera

Similar telugu story from Thriller