Dinakar Reddy

Abstract Comedy

4  

Dinakar Reddy

Abstract Comedy

ఒక జ్ఞాపకం

ఒక జ్ఞాపకం

1 min
330


నేను : నాన్నా! ఏంటి నాన్నా ఈ వాట్సాప్ స్టేటస్..

నాన్న : My life My rules 


నేను: 

నా ఖర్మ.. నీకు స్మార్ట్ ఫోన్ కొనిచ్చి నేను తప్పు చేశాను

నాన్న: 

నిన్ను స్మార్ట్ ఫోన్ కొనుక్కోనిచ్చి నేను తప్పు చేశానని ఎప్పుడైనా అన్నానా నాన్నా?


నేను : సినిమాలు ఎక్కువ చూసి ఇలా తయారయ్యావు నాన్నా..

జాలి గుండె లేని కొడుకు కన్నా కుక్క మేలురా ఈ లిరిక్స్ నీకు అంత బాగా నచ్చాయా..


నాన్న : నాలో ఒక కవి ఉన్నాడురా..


నేను : నాలో ఒక విమర్శకుడు ఉన్నాడు నాన్నా..


నేను : నీ వాట్సాప్ స్టేటస్ చూసి నేనేదో విలన్ అయినట్లు అందరూ నన్ను సావగొడుతున్నారు..


నాన్న : అవునా.. సర్లే.. ఏదో లిరిక్స్ నచ్చి పెట్టారా బాబూ

. కంటే కొడుకునే కనాలి అని పెట్టనా..


నేను : ఆ పాట లేదు నాన్నా..


నాన్న: మనమే సృష్టిద్దాం రా.. అసలు మాయాబజార్ లో ఎస్వీర్ ఏమన్నాడో తెలుసా? 

ఎవరూ సృష్టించకుండా మాటలెలా పుడతాయి..


నేను : నాకు పెద్ద పరిచయం లేదులే..


నాన్న : నాకుంది. అప్పట్లో నేనూ గుమ్మడీ క్లబ్ లో కలిసి మాట్లాడుకునే వాళ్ళం.. ఆ రోజులే వేరు..


నేను : నాన్నా ఈరోజు సాయంత్రం టీవీలో మాయాబజార్ సినిమా వస్తుంది..


నాన్న : ఇంకేం.. తొందరగా ఆఫీసు నుండి వచ్చెయ్.. అమ్మ పకోడీలు వేస్తోంది.. తింటే పకోడీ తినాలి.. చూస్తే మాయాబజార్ చూడాలి..


నేను : అంతే.. వచ్చేస్తా నాన్నా..


(నాన్నతో చేసిన ప్రతి చాటింగ్ ఒక అమూల్యమైన జ్ఞాపకమే..)



Rate this content
Log in

Similar telugu story from Abstract