STORYMIRROR

Narra Pandu

Abstract Romance Tragedy

4  

Narra Pandu

Abstract Romance Tragedy

నా వేగుచుక్క ఎక్కడ...?

నా వేగుచుక్క ఎక్కడ...?

1 min
187

నా వేగుచుక్క ఎక్కడ

అడుగడునా ఆకాశమంతా ప్రేమతో

వేకువ జామున వెన్నెల వెలుగులో వెతికిన...

నా వేగుచుక్క ఎక్కడని...

నాకు దూరమవుతున్నపుడు కొంటేచూపుతో వెళ్లిందని భయంతో కొండకొనల్లో వెతికిన...

నా వేగుచుక్క ఎక్కడని...

రాతిలాంటి నా గుండెని ఒక్క రాతిరిలోనే మార్చేసి నన్ను మనిషిని చేసిందని రాళ్ళల్లో , రప్పల్లో , చేలల్లో , చెలకల్లో వెతికిన...

నా వేగుచుక్క ఎక్కడని...

నిశీధి రాతిరి నీడలో నిలువెల్లా ప్రేమతో నింగి నేల వెతికిన...

నా వేగుచుక్క ఎక్కడని...

నా గుండెలోనే ఉందేమోనని నా గుండె గూటి తలుపులు తెరిచి వెతికిన...

నా వేగుచుక్క ఎక్కడని...

అయిన కనిపించలేదు....

ఎందుకంటే...,

నా వేగుచుక్క నాతో లేదు ఇపుడు

నాకు వేగుచుక్క లేనేలేదు అస్సలు ఎపుడు-నర్ర పాండు✍️


Rate this content
Log in

Similar telugu story from Abstract